బహ్రెయిన్ లో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం..!!

- September 25, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం..!!

మనామా : అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం బహ్రెయిన్ లో పర్యటిస్తుంది.  వలస కార్మికుల రక్షణ కేంద్రంలో అమెరికా ప్రతినిధి బృందాన్ని బహ్రెయిన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) స్వాగతించింది. కార్మికుల శ్రేయస్సుకు, అదే సమయంలో వారి హక్కులకు పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి ప్రతినిధుల బృందానికి వివరించారు.  

 LMRA వ్యవస్థకు కనెక్ట్ అయిన ఆర్థిక సంస్థల ద్వారా అన్ని కార్మికుల జీతాలు ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించబడుతున్నాయని,  మెరుగైన వేతన రక్షణ వ్యవస్థ ముఖ్య కార్యక్రమాలలో ఇది ఒకటని తెలియజేశారు. వలస కార్మికుల రక్షణ కేంద్రం నేతృత్వంలో మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి బహ్రెయిన్ చేస్తున్న ప్రయత్నాలపై వివరణాత్మక ప్రదర్శనను నిర్వహించారు. కార్మిక హక్కులు మరియు మానవ అక్రమ రవాణా నివారణపై అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాలని ఈసందర్భంగా వారు అభిప్రాయపడ్డారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com