'జటాధర' నుంచి ఫస్ట్ ట్రాక్ సోల్ ఆఫ్ జటాధర రిలీజ్
- September 26, 2025
నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. హై-ఆక్టేన్ విజువల్స్, పౌరాణిక ఇతివృత్తాలతో ఈ చిత్రం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది.
ఇటివల రిలీజ్ అయిన టీజర్ నేషనల్ వైడ్ గా వైరల్ అయ్యింది. ఈ విజువల్ స్పెక్టకిల్ జటాధర నవంబర్ 7, 2025న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. మేకర్స్ తాజాగా మేకర్స్ ఫస్ట్ ట్రాక్ 'సోల్ ఆఫ్ జటాధార'ను రిలీజ్ చేశారు.
‘సోల్ ఆఫ్ జటాధర’ సినిమా ప్రిమైజ్ ని అద్భుతంగా సెట్ చేసింది. సాంప్రదాయ సంగీతం, డివైన్ టచ్ కలిపిన ఈ స్వరాలు మనల్ని జటాధర ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. బీట్‌లు చాలా ఇంటెన్స్‌గా ఉండి, సినిమా టోన్‌తో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. “ఓం నమఃశివాయ” జపం గూస్ బంప్స్ తెప్పించింది.
సోల్ ఆఫ్ జటాధర’తో ప్రమోషన్స్‌కి ఇప్పుడు కంప్లీట్ జోష్ కంపొచ్చింది. రాజీవ్ రాజ్ కంపోజ్ చేసి, స్వయంగా పాడిన ఈ ఆడియో గ్లింప్స్ అందరిని ఆకట్టుకుంది. డివోషనల్ డెప్త్, రా ఎనర్జీతో కూడినన ఈ పాట సినిమా ఎసెన్స్ ని ప్రజెంట్ చేస్తోంది.
జటాధరలో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, దివ్య ఖోస్లా, శిల్పా శిరోధ్కర్, ఇంద్రకృష్ణ, రవి ప్రకాష్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, సుభలేఖ సుధాకర్‌తో పాటు ప్రముఖ కనిపించనున్నారు. మంచికి–చెడుకి, వెలుగుకి–చీకటికి, మానవ సంకల్పానికి– విధికి మధ్య జరిగే అద్భుతమైన పోరాటాన్ని ఈ చిత్రం చూపించబోతోంది.
జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. అక్షయ్ కేజ్రీవాల్, కుస్సుమ్ అరోరా సహ నిర్మాతలుగా వ్యవహరించారు. డివ్యా విజయ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా, భావిని గోస్వామి సూపర్వైజింగ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు.
సినిమాకి పవర్ ఫుల్ సౌండ్‌స్కేప్‌ను జీ మ్యూజిక్ కో అందిస్తోంది. జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్







