టెన్నిస్ క్వార్టర్స్‌లో తెలుగు తేజాలు...

- July 20, 2016 , by Maagulf
టెన్నిస్ క్వార్టర్స్‌లో తెలుగు తేజాలు...

తెలంగాణ కుర్రాడు తీర్థ శశాంక్ జోరుమీదున్నాడు. సింగపూర్‌లో జరుగుతున్న అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్-5 టోర్నీలో అతను సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కల్లాంగ్ టెన్నిస్ సెంటర్‌లో బుధవారం జరిగిన బాలుర సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో తీర్థ శశాంక్ 6-3, 6-3తో ఐదో సీడ్ ఆర్మిన్ రోస్తామి (ఇరాన్)కి షాకిచ్చాడు.బాలుర డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో ద్రోణ వాలియాతో జతకట్టిన శశాంక్ 4-6, 7-5, 10-8తో దర్శన్ సురేశ్ (మలేసియా)-షెంగ్ యిన్ స్టిఫెన్ (చైనా)లపై చెమటోడ్చి నెగ్గాడు. బాలికల సింగిల్స్‌లో తెలుగమ్మాయి శ్రీవల్లి రష్మిక కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్‌లో ఆమె 6-3, 6-2తో ఎనిమిదో సీడ్ యిమ్ అష్లె (చైనా)పై సంచలన విజయం సాధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com