పిల్లిని చంపిన వ్యక్తి వీడియో వైరల్.. నెటిజన్లు ఆగ్రహం..!!

- September 27, 2025 , by Maagulf
పిల్లిని చంపిన వ్యక్తి వీడియో వైరల్.. నెటిజన్లు ఆగ్రహం..!!

యూఏఈ:  షార్జాలోని ఓ రెస్టారెంట్‌ వెలుపల రెండు రోజుల్లో అనుమానస్పదంగా మరణించిన రెండు పిల్లుల డెడ్ బాడీలను ఆ రెస్టారెంట్ సిబ్బంది గుర్తించారు. వెంటనే సీసీ ఫుటేజీ పరిశీలించి షాక్ కి గురయ్యారు. ఓ వ్యక్తి ఆ పిల్లులను దారుణంగా హింసించి చంపడం కనిపించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే, అబు షాగరాలోని హౌస్ ఆఫ్ గ్రిల్ మేనేజర్ రషీద్ తన అనుభవాన్ని వివరించాడు. మరణించిన పిల్లుల శరీరాలపై రక్తం కనిపించలేదని, దాంతో అసహజంగా ఏదో జరిగిందని అనుమానించి, CCTV కెమెరాలను పరిశీలించినట్లు తెలిపారు. ఇది చాలా క్రూరంగా ఉందని, ఆ వ్యక్తిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి కాదని,  ఇటీవల, అనేక పిల్లులు గాయపడినట్లు లేదా చనిపోయి కనిపించాయని తెలిపారు.  కాగా,  CCTV ఫుటేజ్‌లో బంధించబడిన అదే వ్యక్తి దీనికి కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు.

 ఇలా జంతువులను చంపడం యూఏఈలో తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఆర్టికల్ 466 ప్రకారం ఉద్దేశపూర్వకంగా ఏదైనా పెంపుడు లేదా ఇతర జంతువును చంపితే ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష,  10,000 దిర్హామ్‌ల వరకు జరిమానా విధిస్తారు. అలాగే, ఆర్టికల్ 473 ప్రకారం ఎవరైనా తన ద్వారా మరొకరికి చెందిన ఏదైనా జంతువుకు గాయాలు కలిగిస్తే, వారికి Dh3,000 జరిమానా విధించబడుతుంది. అలాంటి తప్పు వల్ల ఆ జంతువు మరణిస్తే, శిక్ష Dh10,000 వరకు జరిమానా విధించబడుతుందని అధికారులు హెచ్చరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com