సౌదీలో ఇల్లీగల్ ప్రయాణీకుల రవాణాపై కఠిన చర్యలు..!!
- September 27, 2025
రియాద్: ప్రయాణీకుల రవాణా కార్యకలాపాలలో ఉల్లంఘనలపై సౌదీ అరేబియా కఠిన చర్యలు చేపట్టింది. ఇలాంటి ఉల్లంఘనలను పర్యవేక్షించడానికి, జరిమానా విధించడానికి ట్రాన్స్ పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) ఫీల్డ్ తనిఖీ బృందాలు సౌదీ అరేబియాలోని అనేక ప్రాంతాలు, నగరాల్లో పెద్ద ఎత్తున తనిఖీలను ప్రారంభించాయి. అవసరమైన లైసెన్స్ లు పొందకుండా ప్రైవేట్ వాహనాలను ఉపయోగించి ప్రయాణీకులను చేసే వ్యక్తులపై, అలాగే స్థానికంగా "కడదా" అని పిలువబడే అక్రమ రైడ్ సేవలను నిర్వహిస్తున్న వారిపై డ్రైవ్ సందర్భంగా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.
కొత్త భూ రవాణా చట్టం ప్రకారం.. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి SR20,000 వరకు జరిమానాలు, 60 రోజుల పాటు వాహన సీజ్ మరియు పదేపదే ఉల్లంఘనలకు పాల్పడితే, వాహనాన్ని బహిరంగ వేలంలో విక్రయించడం జరుగుతుందని అధికారులు హెచ్చరించారు. సౌదీయేతర నేరస్థులను బహిష్కరిస్తామన్నారు. లైసెన్స్ పొందిన ఆపరేటర్లనే ఉపయోగించుకోవాలని ప్రమాణికులకు అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఒమన్, కువైట్తో ఖతార్ సహకారం బలోపేతం..!!
- బీచ్లో స్టంట్స్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీలో ఇల్లీగల్ ప్రయాణీకుల రవాణాపై కఠిన చర్యలు..!!
- పిల్లిని చంపిన వ్యక్తి వీడియో వైరల్.. నెటిజన్లు ఆగ్రహం..!!
- ఇండియన్ క్లబ్ ‘ఆవాణి’ ఓనం ఫియస్టా..!!
- కువైట్ లో ఉత్సాహంగా వికసిత్ భారత్ రన్ ..!!
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ