ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- September 30, 2025
అమెరికా: అమెరికా వెలుపల నిర్మించిన అన్ని సినిమాలపై 100 శాంతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు.ఇది హాలీవుడ్ ప్రపంచ వ్యాపార విధానాన్ని కుదిపేసే నిర్ణయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ చర్య ద్వారా ట్రంప్ రక్షణాత్మక వాణిజ్య విధానాలను సాంస్కృతిక రంగాలలోకీ (కల్చరల్ ఇండస్ట్రీస్) విస్తరించనున్నట్లు సంకేతం ఇచ్చారు. దీంతో అంతర్జాతీయ బాక్సాఫీస్ ఆదాయంపై ఆధారపడే స్టూడియోల్లో అనిశ్చితి నెలకొంది. ట్రంప్ సుంకాలతో భారతీయ సినిమాలపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది.
ట్రంప్ తన “ట్రూత్ సోషల్”లో పోస్ట్ చేస్తూ.. అమెరికా సినిమా నిర్మాణ అంశంలో ఇతర దేశాలతో పోటీలో వెనుకబడుతోందని పేర్కొన్నారు. “మన సినిమా నిర్మాణ వ్యాపారాన్ని అమెరికా నుంచి ఇతర దేశాలు దోచుకుపోయాయి. ఇది పిల్లల వద్ద నుంచి కాండీని దొంగిలించినట్లే..” అని చెప్పారు.
అయితే ఈ 100 శాతం సుంకాన్ని విధించడానికి ట్రంప్ ఏ చట్టపర అధికారాన్ని వాడతారో స్పష్టత లేదు. ఈ సుంకాలను ఎలా అమలు చేస్తారనే విషయంపై వైట్ హౌస్ స్పందించలేదు. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, కామ్‌కాస్ట్, పరమౌంట్ స్కైడాన్స్, నెట్‌ఫ్లిక్స్ నుంచి కూడా ఇప్పటివరకు స్పందన లేదు. నెట్‌ఫ్లిక్స్ షేర్లు ప్రారంభ ట్రేడింగ్‌లో 1.5% తగ్గాయి.
సినిమాలపై సుంకాలు విధించాలన్న యోచనను ట్రంప్ తొలిసారి మేలో ప్రస్తావించారు. కానీ, అందుకు సంబంధించిన వివరాలు చెప్పలేదు. అది కొన్ని దేశాలకే వర్తిస్తుందా? అన్న విషయంలో సినిమా రంగానికి స్పష్టత లేదు.
స్టూడియో నిర్వాహకులు ఈ సంవత్సరం ప్రారంభంలో మీడియాతో మాట్లాడుతూ… సినిమా సుంకాన్ని ఎలా అమలు చేస్తారో అర్థం కాక అయోమయం చెందామని అన్నారు. ఈ కాలంలో సినిమాలు నిర్మాణం, ఆర్థిక సహకారం, పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి అంశాలలో పలు దేశాలపై ఆధారపడుతున్నాయని పేర్కొన్నారు.
ట్రంప్ నిర్ణయంపై నిపుణులు పలు సందేహాలు వ్యక్తం చేశారు. సినిమాలను ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ (సాహిత్యం, కళ, సంగీతం వంటి హక్కులు) రూపంగా పరిగణిస్తారు. ఇవి ప్రపంచ సేవల వ్యాపారంలో భాగమని కొందరు పేర్కొన్నారు. ఈ రంగంలో అమెరికా ఎక్కువగా లాభాలు పొందుతోంది. అందువల్ల సుంకాలకు చట్టపర ఆధారం ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
విదేశీ స్టూడియోలతో కలిసి నిర్మించే సినిమాలు పెరుగుతున్నాయి. అలాంటి సినిమాలను ఎలా వర్గీకరిస్తారన్న సందేహాలు కూడా ఉన్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







