'థామా' తప్పకుండా ఆడియన్స్ అలరిస్తుంది: హీరోయిన్ రష్మిక మందన
- September 30, 2025
ఆయుష్మాన్ ఖురానా, రష్మిక హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా ‘థామా’. హారర్ కామెడీగా రూపొందిన ఈ సినిమాకి ఆదిత్యా సర్పోత్దార్ దర్శకత్వం వహించారు. పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలు పోషించారు.మాడాక్ ఫిల్మ్స్ సమర్పణలో దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు.ఈ మూవీ అక్టోబరు 21న విడుదల కానుంది.ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో హీరో ఆయుష్మాన్ ఖురానా మాట్లాడుతూ... అందరికీ నమస్కారం.మాడాక్ ఫిల్మ్స్ యూనివర్స్ లో భాగమవడం చాలా ఆనందంగా ఉంది.మాడాక్ ఫిల్మ్స్ హారర్ కామెడీ యూనివర్సిటీలో వస్తున్న నెక్స్ట్ చాప్టర్ థామా. బేతాళ్ కి హెడ్ థామా. రష్మిక గారితో ఫస్ట్ టైం కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. రష్మిక బ్రిలియంట్ పెర్ఫార్మర్. ఫస్ట్ టైం హైదరాబాద్ ఫిలిం ప్రమోషన్ కోసం వచ్చాను. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడకి రావడం చాలా ఆనందంగా అనిపించింది.ఈ సినిమాని తమిళనాడు, ఊటీ లో కూడా షూట్ చేసాము. ఇది ఫుల్ పాన్ ఇండియా ఫిలిం. నేను ప్రతి సినిమాకి ఒక కొత్త కాన్సెప్ట్ ఉండేలాచూస్తుంటాను.ఈ సినిమా కాన్సెప్ట్ కూడా ఆడియన్స్ ని అలరిస్తుంది. ఫస్ట్ టైం ఇంత యాక్షన్ చేశాను. ఇలాంటి క్యారెక్టర్ చేయడం నాకు చాలా కొత్తగా అనిపించింది. అందరూ 21 అక్టోబర్ నా థియేటర్స్ కి వచ్చి ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.
హీరోయిన్ రష్మిక మందన మాట్లాడుతూ...మాడాక్ హారర్ కామెడీ ఫిలిమ్స్ లో చాలా మంచి కాన్సెప్ట్ ఉంటుంది. కథకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. పర్ఫార్మెన్స్ లో అమేజింగ్ గా ఉంటాయి.ఈ యూనివర్స్ కి ఆడియన్స్ నుంచి చాలా మంచి ఆదరణ ఉంది. అలాంటి సినిమా చేస్తున్నప్పుడు కచ్చితంగా మనపై రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన మాడాక్ ఫిలింస్ కి థాంక్యూ. తప్పకుండా ఈ సినిమా వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఉంటుంది. ప్రతి సినిమాకి ఒక కొత్త క్యారెక్టర్ చేయాలని ప్రయత్నిస్తుంటాను. ఈ సినిమాతో కూడా ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తానని భావిస్తున్నాను. ఈ సినిమా 21 అక్టోబర్ రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్స్ లో చూసి మీ బ్లెస్సింగ్స్ అందిస్తారని కోరుకుంటున్నాను.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







