కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- October 01, 2025
కువైట్: KNET డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులను ఎలక్ట్రానిక్ చెల్లింపులపై కువైట్‌లోని కస్టమర్ల నుండి అదనపు రుసుములు లేదా కమీషన్లు వసూలు చేయడాన్ని నిషేధించాలని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (CBK) ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు అన్ని స్థానిక బ్యాంకులు, ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవా సంస్థలు, ఇ-మనీ సేవా కేంద్రాలకు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
పాయింట్-ఆఫ్-సేల్ (POS) పరికరాలు లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపు గేట్‌వేల ద్వారా ఉపయోగించిన సందర్ధాల్లోనూ అదనపు రుసుములను వసూలు చేయొద్దని ఆదేశించింది. డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించిన సమయంలో వ్యాపారులు కస్టమర్ల వద్ద నుంచి అదనపు మొత్తాలను వసూలు చేస్తున్నట్లు అందిన ఫిర్యాదులకు వ్యతిరేకంగా ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించింది. నిబంధనలను ఉల్లంఘించే సంస్థలు పాటించకపోతే సేవలను నిలిపివేయడంతోపాటు ఆయా వ్యాపార సంస్థలతో ఉన్న అన్ని ఒప్పందాలను రద్దు చేస్తామని కువైట్ సెంట్రల్ బ్యాంక్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







