బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!
- October 03, 2025
రియాద్: అన్ని స్థానిక బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు తమ ఉద్యోగులకు జీతాలు మరియు ఆర్థిక సహాయం పంపిణీలో ఎటువంటి ఆలస్యం లేకుండా సత్వర లావాదేవీలు జరిగేలా చూసుకోవాలని సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) ఆదేశించింది. ఇందు కోసం ఏడు కీలక ఆదేశాలను జారీ చేసింది.
వివిధ రంగాలలోని ఉద్యోగులకు ఆర్థిక సహాయం మరియు జీతాలను డిపాజిట్ చేయడానికి, బదిలీ చేయడానికి విధానాలను సెంట్రల్ బ్యాంక్ వివరించింది. డిపాజిట్ మరియు బదిలీ ప్రక్రియల సమయంలో టెక్నికల్ వ్యవస్థలపై పర్యవేక్షణ సంసిద్ధతను పెంచుకోవాలని సూచించింది. ఏదైనా సాంకేతిక సమస్యలు ఎదురైనప్పుడు సకాలంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయ ప్రణాళికలను అభివృద్ధి చేసుకోవాలని తన సర్క్యులర్ లో వెల్లడించింది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులు పూర్తి కాగానే వివరణాత్మక నివేదికలను మూడు పని దినాలలోపు అందించాలని బ్యాంకులను ఆదేశించింది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







