తప్పిపోయిన ఫాల్కన్ల ఓనర్లకు గుడ్ న్యూస్..!!
- October 04, 2025
దోహా: ఖతార్ లోని రాస్ లఫాన్, మెసాయిద్ మరియు దుఖాన్ పారిశ్రామిక నగరాల నుండి తప్పిపోయిన ఫాల్కన్లను తిరిగి పొందడంలో యజమానులకు సహాయం చేస్తామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ప్రకటించింది. దీంతో యజమానులు తమ ఫాల్కన్లను వెతకడానికి ఇండస్ట్రియల్ ప్రాంతాలలోకి ప్రవేశించడానికి అనుమతించనున్నట్లు తెలిపింది. తమ నిర్ణయానికి ప్రజలు సహకరించాలని మరియు సహాయం కోసం నియమించబడిన హాట్‌లైన్‌లను సంప్రదించి అనుమతి పొందాలని అధికారులు కోరారు. అనుమతి లేకుండా ఈ ప్రాంతంలోకి వచ్చినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉమ్ అల్ హౌల్ / రాస్ బుఫాంటాస్ లో 2364600, 2364609
రాస్ లఫాన్ లో 40146555, 2361555
దుఖాన్ లో 40141000, 2364691
మెసయీద్ లో 40138644, 2361593 హాట్ లైన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!







