ఏపీ: ఆటో డ్రైవర్ సేవలో..
- October 04, 2025
విజయవాడ: కూటమి ప్రభుత్వం సంక్షేమం దిశగా మరో అడుగు వేసింది. ఇప్పటికే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ క్రమంలో డ్రైవర్ల సంక్షేమం కోసం ఆటో డ్రైవర్ సేవలో… పథకానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలోని సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా ఈ పథకం రూపొందించింది. ఈ పథకం కింద అర్హులైన డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఇవ్వ నున్నారు. ఈ పథకాన్ని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్,మంత్రి నారా లోకేష్, బీజేపీ BJP రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరుకానున్నారు. సొంత ఆటో, క్యాబ్ కలిగి వాటిపై ఆధారపడి జీవిస్తున్న వారి కోసం రూపొందించిన ఈ పథకానికి రాష్ట్రవ్యా ప్తంగా 2,90,669 మంది లబ్దిదారులను అర్హులుగా గుర్తించారు.
వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.436 కోట్లను కేటాయించింది. ఈ నిధులను నేరుగా డ్రైవర్ల ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు కేవలం ఏడాదికి రూ.10వేలు మాత్రమే ఇచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం గత పాలకులకంటే 50 శాతం అదనంగా రూ.15 వేలు ఇస్తోంది. అలాగే గత ప్రభుత్వం ఈ పథకానికి కేవలం 2,61,516 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించి రూ. 261.51 కోట్లే ఖర్చు పెట్టింది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కూటమి సర్కారులో లబ్ధిదారులు సుమారు 30 వేల మంది పెరిగారు..అలాగే | డ్రైవర్లకు రూ.175 కోట్లు అదనంగా లబ్ధి చేకూరుతోంది. కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంలో ఆటో డ్రైవర్లు 2,25,621 మంది, త్రీ వీలర్ ప్యాసింజర్ వాహనాల డ్రైవర్లు 38,576 మంది, మోటార్ క్యాబ్ డ్రైవర్లు 20,072 మంది, మ్యాక్సి క్యాబ్ డ్రైవర్లు 6,400 మంది ఉన్నారు. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 22,955 మంది డ్రైవర్లకు లబ్ది కలగనుంది. వాస్తవంగా చూస్తే ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేలు అనే కార్యక్రమం పార్టీ మేనిఫెస్టోలో చెప్పలేదు. అయితే స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం అమలు నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు సాయం అందించాలనే ఉద్దే శ్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తోంది.
ఏ ఒక్క లబ్ధిదారు నష్టపోకూడదని సిఎం స్పష్టం చేయడంతో గతానికంటే ఆర్థిక సాయం పెరగడంతో పాటు లబ్దిదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గత ప్రభుత్వంలో ఉన్న రోడ్ల దుస్థితి కారణంగా ఆటో డ్రైవర్లు, వాహనదారులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. గుంతల రోడ్ల కారణంగా ఆటోలు, ఇతర వాహనాలు దారుణంగా దెబ్బతినేవి. వీటి రిపేర్ల ఖర్చు తడిసిమోపెడు అయ్యేది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ సమస్య నుంచి గట్టెక్కించింది. రూ.1,000కోట్లు ఖర్చు చేసి రోడ్ల మరమ్మతులు చేపట్టి సాఫీగా ప్రయాణం సాగేలా చేసింది. అంతేకాకుండా పాతవాహనాలపై గత ప్రభుత్వం భారీగా వేసిన గ్రీన్ ట్యాక్స్ల్స్ను కుదించింది. నాడు రూ. 20 వేలు ఉన్న గ్రీన్ ట్యాక్స్్ను రూ.3 వేలకు తగ్గించి వాహనదారులకు పెద్దమొత్తంలో ఉపశమనం కలిగించింది. దీంతో ఆటోలు, క్యాబ్లపై పెద్ద ఎత్తున భారం తొలగింది. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకం అందేలా చేయాలని అధికారులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. అర్హత ఉండి కూడా జాబితాలో పేరు లేకుంటే… వారి సమస్యను పరిష్కరించిన వెంటనే లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు. దీని కోసం ప్రత్యేకంగా ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రభుత్వం ఓ వ్యవస్థను ఏర్పాటు చేసింది. వాట్సాప్ ద్వారా ఒక ప్రత్యేక గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ సిస్టమ్ను కూడా అందుబా టులోకితెచ్చింది. లబ్ధిదారులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కరూర్ ఘటనపై విజయ్ పై హైకోర్టు ఆగ్రహం
- ఏపీ: ఆటో డ్రైవర్ సేవలో..
- ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు..
- పౌరుల హక్కుల పరిరక్షణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కీలకం..!!
- రెసిలెన్స్ ఫ్లీట్లో పౌరుల భద్రతపై ఒమన్ పర్యవేక్షణ..!!
- రక్షణ సంబంధాలపై సౌదీ, ఖతార్ చర్చలు..!!
- UK సినగోగ్ పై ఘోరమైన దాడి.. ఖండించిన బహ్రెయిన్..!!
- దుబాయ్లో అక్రమ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్..!!
- తప్పిపోయిన ఫాల్కన్ల ఓనర్లకు గుడ్ న్యూస్..!!
- ఫ్లిప్కార్ట్ లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 8 వరకు ఆఫర్లు