రష్యాకు సీఏఎస్ లోనూ ఎదురుదెబ్బ ..
- July 21, 2016
రష్యాకు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)లోనూ ఎదురుదెబ్బ తగిలింది. తమపై ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ (ఐఏఏఎఫ్) విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సీఏఎస్ గురువారం తోసిపుచ్చింది. దీంతో రియో ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లో పాల్గొనే అవకాశం కోల్పోయారు రష్యన్ అథ్లెట్లు. తాము డోపింగ్ టెస్ట్‌లో విఫలం కాకున్నా తమపై నిషేధం విధించారంటూ రష్యన్ ఒలింపిక్ కమిటీ, 68 మంది రష్యా అథ్లెట్లు సీఏఎస్‌లో పిటిషన్ వేశారు. సీఏఎస్ తీర్పును తాము పరిగణలోకి తీసుకుంటామని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ స్పష్టంచేసింది. అయితే ఈ తీర్పు క్రీడా ప్రపంచంలో సంక్షోభం సృష్టించబోతుందని భావిస్తున్నారు. ఒలింపిక్ ఉద్యమంలో చీలిక వచ్చే ప్రమాదం ఉందని ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. రష్యా ప్రభుత్వమే డోపింగ్‌ను ప్రోత్సహిస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో గత నవంబర్ నుంచి ఆ దేశ అథ్లెట్లపై నిషేధం విధించింది ఐఏఏఎఫ్. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఏర్పాటు చేసిన కమిషన్ కూడా డోపింగ్ ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతోందని తేల్చింది. రియోలో రష్యా అథ్లెట్ల భవితవ్యంపై వచ్చే వారంలో ఐవోసీ కీలక నిర్ణయం తీసుకోనుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







