'హైలెస్సో' పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్
- October 04, 2025
సుడిగాలి సుధీర్ గా అందరికీ సుపరిచితుడైన సుధీర్ ఆనంద్ హీరోగా ప్రసన్న కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్న చిత్రం హైలెస్సో. వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. ఇది వారి బ్యానర్‌కు ప్రొడక్షన్ నంబర్ 1, సుధీర్ ఆనంద్‌కు హీరోగా ఐదవ చిత్రం. గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో కోర్ట్ సినిమాలో తన ఇంటెన్స్ నటనతో ఆకట్టుకున్న శివాజీ విలన్‌గా కనిపించబోతున్నారు.
దసరా సందర్భంగా సుధీర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇంటెన్స్ అండ్ డివైన్ వైబ్ తో వున్న పోస్టర్ అదిరిపోయింది. ఫస్ట్ లుక్ కి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
ఈ సినిమాలో నటాషా సింగ్, నక్ష శరణ్ హీరోయిన్లుగా నటించగా, ప్రముఖ కన్నడ నటి అక్షర గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు. మొట్ట రాజేంద్రన్, గెటప్ శ్రీను, బెవర దుహిత శరణ్య ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.
యంగ్ అండ్ టాలెంటెడ్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. అనుదీప్ దేవ్ సంగీతం అందించగా, సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఎడిటర్‌గా చోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి, చింతా శ్రీనివాస్ రైటర్.
హై లెస్సో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.
తారాగణం: సుధీర్ ఆనంద్, శివాజీ, నటాషా సింగ్, నక్ష శరణ్, అక్షర గౌడ, మొట్ట రాజేంద్రన్, గెటప్ శ్రీను, బెవర దుహిత శరణ్య
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: వజ్ర వారాహి సినిమాస్
నిర్మాతలు: శివ చెర్రీ - రవికిరణ్
దర్శకత్వం: ప్రసన్న కుమార్ కోట
సంగీతం: అనుదీప్ దేవ్
DOP: సుజాత సిద్దార్థ్
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
రచయిత: చింతా శ్రీనివాస్
కాస్ట్యూమ్ డిజైనర్: రంజిత గువ్వల
కొరియోగ్రాఫర్: విజయ్ పోలాకి
స్టంట్స్: పృధ్వీ
లైన్ ప్రొడ్యూసర్: ఉదయ్ నందిపాటి
మార్కెటింగ్: మనోజ్ వల్లూరి (హాష్‌ట్యాగ్ మీడియా)
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్
- పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్డి అప్లోడ్
- ఏవియేషన్ హబ్‌గా భారత్







