'శ్రీచక్రం' అనౌన్స్‌మెంట్, త్వరలో ఫస్ట్ గ్లింప్స్, 2026 దసరాకి సినిమా రిలీజ్
- October 04, 2025
మిరాయ్ భారీ విజయం తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరో సినిమాటిక్ స్పెక్టికల్ రాజు గది 4: “శ్రీచక్రం”తో రెడీ అవుతోంది. రాజు గారి గదిని కల్ట్ హారర్-కామెడీ ఫ్రాంచైజీగా మార్చిన విజనరీ ఫిల్మ్ మేకర్ ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న ఈ నాల్గవ భాగం ఈ సిరీస్‌ను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లనుంది. దసరా శుభ సందర్భంగా ఈరోజు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసింది
అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ఎర్రటి చీరలో ఒక మహిళ, ఉగ్రమైన, దైవిక కాళిని గుర్తుచేసే దేవత విగ్రహం ముందు ఎగురుతోంది. ఈ అద్భుతమైన ఇమేజరీ పవిత్రమైన, అతీంద్రియాల మధ్య సాగే చిత్రానికి టోన్ సెట్ చేస్తుంది.
"ఎ డివైన్ హర్రర్ బిగిన్స్" అనే పవర్ ఫుల్ ట్యాగ్‌లైన్‌తో శ్రీచక్రం ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. గ్రాండ్ విజువల్స్, ఎస్ఎస్ థమన్ పవర్ ఫుల్ మ్యూజిక్, ఓంకార్ సిగ్నేచర్ స్టోరీ టెల్లింగ్‌తో, శ్రీచక్రం యూత్, కుటుంబ ప్రేక్షకులను అలరించే మాస్ థియేట్రికల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని హామీ ఇస్తుంది.
పురాణ విశ్వాసాలు, హిడెన్ సీక్రెట్స్, మరచిపోయిన వారసత్వాలపై ఆధారంగా రూపుదిద్దుకున్న డివైన్ హారర్-కామెడీ ‘శ్రీచక్రం’. ప్రత్యేకమైన అనుభూతిని అందించేందుకు ఈ చిత్రం సిద్ధమైంది. రహస్యాలతో నిండిన ‘కాలికాపురం’ అనే గ్రామం నేపథ్యంగా నడిచే ఈ కథ, కేవలం ఒక హాంటెడ్ టేల్ మాత్రమే కాదు. ఇది ఆధ్యాత్మిక యాత్రలా సాగుతూ, మిస్టిసిజంతో నిండి, సస్పెన్స్ థ్రిల్ల్స్, మాస్ హ్యూమర్ మూమెంట్స్ తో ఎంటర్‌టైన్ చేసే గొప్ప అనుభూతిని అందించబోతోంది.
ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటర్. శ్రీ నాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్ కాగా, అజ్జు మహాకాళి డైలాగ్ రైటర్.
RGG4 – శ్రీచక్రం భయపెట్టే క్షణాలు, నవ్వించే సన్నివేశాలు, భక్తి, భయం కలిసి మరిచిపోలేని హారర్ అనుభవాన్ని ఇవ్వనుంది.
ఫస్ట్ గ్లింప్స్ కోసం రెడీగా ఉండండి. ఎందుకంటే ఒకసారి ‘శ్రీచక్రం’ తెరుచుకున్నాక… దాన్ని మూయడం అసాధ్యం.
ఈ చిత్రం దసరా 2026కి థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాత: టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
దర్శకత్వం: ఓంకార్
సంగీతం: ఎస్ఎస్ థమన్
డిఓపి: సమీర్ రెడ్డి
ఎడిటర్: తమ్మిరాజు
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగల
డైలాగ్స్ : అజ్జు మహాకాళి
CEP: సుజిత్ కుమార్ కొల్లి
పీఆర్వో: వంశీ శేఖర్
తాజా వార్తలు
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!







