చిన్నారుల మృతి ఘటనలపై ఏపీ ప్రభుత్వం సీరియస్
- October 05, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేసిన ఘటన ఇది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థినుల మృతిచెందడం, మరో 120 మందికిపైగా విద్యార్థినులు అస్వస్థతకు గురవడం పెద్ద కలకలాన్ని రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. పిల్లలను గురుకుల పాఠశాలలకు పంపడం సురక్షితమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అటు అనంతపురం శిశుసంరక్షణ కేంద్రంలోనూ ఓ శిశువు చనిపోయింది. దీంతో అసలేం జరుగుతోందో తెలియాలంటూ ప్రభుత్వం యాక్షన్ షురూ చేసింది…! మరణాలకు కారణాలు తేల్చాలని ఆదేశాలు జారీ చేసింది.పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఇద్దరు చనిపోవడం ఏపీలో కలకలం రేపుతోంది.
తీవ్ర జ్వరం, పచ్చకామెర్లతో ఆ ఇద్దరు విద్యార్థినులు చనిపోగా.. మరో 120 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. అస్వస్థతకు గురైన వాళ్లను విశాఖ కేజీహెచ్ (KGH) సహా పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
అలాగే ప్రిన్సిపాల్ సహా మరో ఇద్దరిపై చర్యలు తీసుకున్నారు.విషయం తెలిసిన వెంటనే విశాఖ KGHకు వెళ్లి.. చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి.పిల్లల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి సంధ్యారాణి.
అలాగే ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మంత్రి సంధ్యారాణికి ఫోన్ చేయడంతో.. పరిస్థితులను సీఎంకు వివరించారు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.మన్యంలో వర్షాలు పడగానే జ్వరాలు విజృంభిస్తాయని.. ఆ వర్షాల కారణంగానే జ్వరాలొచ్చాయన్నారు మంత్రి సంధ్యారాణి.
తాజా వార్తలు
- ఎవరెస్టు పై మంచుతుఫాను..1000 మంది దిగ్బంధం
- By Mistake డబ్బు పంపారా? ఈ నంబర్‌కు కాల్ చేయండి!
- ఐసీసీ మహిళల ప్రపంచ కప్: పాక్ ని చిత్తు చిత్తుగా ఓడించిన భారత్..
- గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక
- చిన్నారుల మృతి ఘటనలపై ఏపీ ప్రభుత్వం సీరియస్
- ప్రపంచంలోనే తొలి స్పేస్ డెలివరీ వెహికల్
- ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకున్న తెలంగాణ యువతి
- మలేషియా ప్రభుత్వం ప్రారంభించిన మైగ్రెంట్ రిపాట్రియేషన్ ప్రోగ్రాం 2.0
- కరీంనగర్ లో ఘనంగా ఆర్ఎస్ఎస్ పథ సంచాలన్...
- శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్..