ఎవరెస్టు పై మంచుతుఫాను..1000 మంది దిగ్బంధం

- October 05, 2025 , by Maagulf
ఎవరెస్టు పై మంచుతుఫాను..1000 మంది దిగ్బంధం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్టు పరిసర ప్రాంతాల్లో భారీ మంచు తుఫాను విరుచుకుపడింది.టిబెట్ వైపుగా సుమారు 16 వేల అడుగుల ఎత్తులో ఈ తుఫాను తాకిడి కారణంగా పరిస్థితులు తీవ్రంగా మారాయి. మంచు తుఫాను కారణంగా 1000 మంది పర్వతారోహకులు, స్థానికులు చిక్కుకుపోయినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఎత్తైన ప్రాంతం కావడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడం, గాలివానలు పెరగడం వల్ల హిమపాతం తీవ్రరూపం దాల్చింది.

చిక్కుకుపోయిన వారిలో కొందరు హైపోథెర్మియా (తీవ్రంగా శరీర ఉష్ణోగ్రత తగ్గిపోవడం)తో బాధపడుతున్నారని సమాచారం. ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోవడం, ఆహారం మరియు తాగునీటి కొరత వలన పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు భారీగా శ్రమిస్తున్నారు. పర్వత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లు కష్టమైనప్పటికీ, హెలికాప్టర్లు, స్పెషల్ రెస్క్యూ టీమ్స్ సహాయంతో శోధన చర్యలు కొనసాగుతున్నాయి.

స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొని, చిక్కుకున్న వారికి ఆహారం, దుప్పట్లు అందజేస్తున్నారు. మరోవైపు నేపాల్ వైపుగా భారీ వర్షాలు బీభత్సం సృష్టించడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. మంచు తుఫాన్లు, వర్షాలు కొనసాగితే సహాయక చర్యలకు ఆటంకం కలగవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ దృశ్యం పర్వతారోహకులు మరియు పర్యాటకుల భద్రత కోసం మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరాన్ని మరోసారి రుజువు చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com