గ్లాస్‌ విండోస్‌కి రక్షణగా స్టీల్‌ బ్యారియర్స్‌ తప్పనిసరి

- July 21, 2016 , by Maagulf
గ్లాస్‌ విండోస్‌కి రక్షణగా స్టీల్‌ బ్యారియర్స్‌ తప్పనిసరి

పెట్రోల్‌ స్టేషన్లు, కేఫ్‌ మరియు రెస్టారెంట్లు ఇకపై కేవలం గ్లాస్‌ డోర్స్‌తో సరిపెడితే కుదరదు. వాటికి రక్షణగా స్టీల్‌ బ్యారియర్స్‌ని ఉపయోగించాల్సిందిగా అజ్మన్‌ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అజ్మన్‌లో ఇటీవల ఓ పెట్రోల్‌ బంక్‌లోని మెక్‌డోనాల్డ్స్‌ రెస్టారెంట్‌లోకి ట్రక్‌ దూసుకుపోవడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలవడంతో ముందు ముందు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా అజ్మన్‌ పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. అజ్మన్‌ పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని యూఏఈ రెసిడెంట్లు స్వాగతించారు. ప్రమాదం జరిగిన తర్వాత ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై అజ్మన్‌ పోలీసులు పలువురి సలహాల్ని తీసుకుంటున్నారు. బ్రిగేడియర్‌ అల్‌ నౌమి మాట్లాడుతూ, ప్రమాదాలు జరగకుండా తాము వీలైనన్ని చర్యలు తీసుకుంటున్నామనీ, పబ్లిక్‌లో కూడా అవేర్‌నెస్‌ కల్పిస్తున్నామనీ, వారు కూడా తమకు సహకరించాల్సి ఉంటుందనీ అలాగే ప్రమాద స్థలాల్ని సోషల్‌ మీడియాలో పెట్టడం వంటి దుశ్చర్యలకు పాల్పడకూడదని విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com