మెరీనా ఫైర్: దుబాయ్ కమ్యూనిటీ గొప్ప మనసు
- July 21, 2016
దుబాయ్ మెరీనా టాలెస్ట్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్‌లో ఒకటైన సులాఫా టవర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో దుబాయ్ కమ్యూనిటీ షాక్‌కి గురైంది. అయితే ఈ సమయంలో బాధితుల్ని ఆదుకునేందుకు దుబాయ్ కమ్యూనిటీ అంతా ఏకమైంది. వెస్టిన్ దుబాయ్ ఈ సందర్భంగా బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొచ్చింది. తాత్కాలికంగా షెల్టర్ కోసం ఎవరైనా సరే తమ హోటల్లో ఆశ్రయం పొందవచ్చని అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించింది. ఈ ఆఫర్ పట్ల సానుకూలంగా స్పందించిన చాఫర్ క్యాబ్ సర్వీస్ కరీమ్, బాధితుల్ని తరలించేందుకు ఉచితంగా తాము సర్వీస్ చేస్తామని ప్రకటించింది. మోయో షావాష్ అనే దుబాయ్ రెసిడెంట్, ట్విట్టర్ ద్వారా సులాఫా టవర్ ఫ్రెండ్స్, తన అపార్ట్మెంట్కి రావొచ్చనీ, వారి కోసం నీళ్ళు, స్నాక్స్ సిద్ధం చేసినట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. కొన్నేళ్ళ క్రితం తాను కూడా ఇలాంటి సమస్యనే ఎందుర్కొన్నాననీ అందుకే ఆ కష్టం తనకు తెలుసని ఆయన ఈ సందర్భంగా వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







