గ్లాస్ విండోస్‌కి రక్షణగా స్టీల్ బ్యారియర్స్ తప్పనిసరి
- July 21, 2016
పెట్రోల్ స్టేషన్లు, కేఫ్ మరియు రెస్టారెంట్లు ఇకపై కేవలం గ్లాస్ డోర్స్‌తో సరిపెడితే కుదరదు. వాటికి రక్షణగా స్టీల్ బ్యారియర్స్‌ని ఉపయోగించాల్సిందిగా అజ్మన్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అజ్మన్‌లో ఇటీవల ఓ పెట్రోల్ బంక్‌లోని మెక్‌డోనాల్డ్స్ రెస్టారెంట్లోకి ట్రక్ దూసుకుపోవడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలవడంతో ముందు ముందు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా అజ్మన్ పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. అజ్మన్ పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని యూఏఈ రెసిడెంట్లు స్వాగతించారు. ప్రమాదం జరిగిన తర్వాత ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై అజ్మన్ పోలీసులు పలువురి సలహాల్ని తీసుకుంటున్నారు. బ్రిగేడియర్ అల్ నౌమి మాట్లాడుతూ, ప్రమాదాలు జరగకుండా తాము వీలైనన్ని చర్యలు తీసుకుంటున్నామనీ, పబ్లిక్‌లో కూడా అవేర్నెస్ కల్పిస్తున్నామనీ, వారు కూడా తమకు సహకరించాల్సి ఉంటుందనీ అలాగే ప్రమాద స్థలాల్ని సోషల్ మీడియాలో పెట్టడం వంటి దుశ్చర్యలకు పాల్పడకూడదని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







