'కబాలి' సినిమా రివ్యూ
- July 21, 2016
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పా. రంజిత్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం లో రజినీకి జోడిగా రాధికా ఆప్టే నటిస్తుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఫై అభిమానులకే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం సినిమా ప్రివ్యూ ఈ విధంగా ఉంది..
రజినీ కాంత్ మొదట జైల్లో ఒక పుస్తకం చదువుతూ ఉన్న సీన్ తో సినిమా మొదలవుతుంది. ఆ తరువాత అయన శిక్ష పూర్తి అయ్యిందని పోలీస్ చెప్పగానే. అయన తన రూమ్ నుంచి స్టైల్ గా బయటికి వస్తాడు. బ్లూ డ్రెస్ వేసుకున్న రజినీ ఆ అతరువాత జైలు పుస్తకంలో సంతకం పెడతాడు. అక్కడి నుంచి తన వస్తువులు తీసుకుని తానే షూస్ ని క్లీన్ చేసుకుని. వాచ్, కోటు ధరించి అంతే స్టైల్ గా బయటికి వస్తాడు. ఇలా రజని ఇంట్రడక్ష్యన్ ఉండబోతుంది.
కథ, కథనం బాగుండడం సినిమాకు ప్లస్ పాయింట్ అయితే కొన్ని లోపాలు మాత్రం సినిమా వేగాన్ని తగ్గించాయని తెలుస్తుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ తో పాటు క్లైమాక్స్ కాస్త నిరాశపరిచే విధంగా ఉందని యుకె టాక్ చెపుతుంది. కాకపోతే క్లైమాక్స్ లో వచ్చే ఊహించని ట్విస్ట్ రజనీ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా షాకింగ్ గా ఉంటుందని అంటున్నారు.
చాలా కాలం తర్వాత రజనీకాంత్ ఈ చిత్రం లో పూర్తి స్థాయి ఎనర్జీ కనపరిచాడు అని టాక్. కాకపోతే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రజనీ యంగ్ గెటప్ కొంచెం ప్రేక్షకులను అప్ సెట్ చేసే విధంగా ఉందట. రజనీకాంత్ - రాధికా ఆప్టే ల మధ్య లవ్ ట్రాక్ బాగుందంటున్నారు.
ఏ చిత్రానికి జరగని విధంగా కబాలి కి ప్రమోషన్ జరిగాయి. ఎయిర్ ఏసియా విమానాన్ని కబాలి పోస్టర్లు, స్టిక్కర్లతో రెడీ చేయడం. ఈ విమానం వైజాగ్, బెంగళూరు, న్యూఢిల్లీ, గోవా, పుణే, చంఢీగర్ తదితర రూట్లలో నడుస్తుంది. కబాలి ఫస్ట్ షో చూడాలనుకునే వారికోసం బెంగళూరు నుంచి చెన్నైకు ప్రత్యేక విమానం కూడా నడుపుతోందీ సంస్థ.
అంతేకాదు కబాలి పేరు మీద సిమ్ కార్డు , బ్యాంక్ కార్డు , వెండి నాణాలు ఇలా రకరకాలుగా కబాలి జనాల్లోకి వెళ్ళింది. కేవలం ఒకే ఒక టీజర్ తో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందింది.
తమిళనాట పలు సాఫ్ట్ వెర్ సంస్థలు శుక్రవారం సెలవు ప్రకటించాయి. ఫ్రెష్ డెస్క్, గో బంపర్, ద సోషల్పీపుల్ వంటి స్టార్టప్‌లు ఈ జాబితాలో ఉన్నా యి. ఓయేత్రీడాట్కామ్ ఏకంగా 2 ఐనాక్స్ స్క్రీన్లనే బుక్ చేసింది. తమ ఉద్యోగులతో పాటు తమ వెబ్సైట్లో షాపింగ్ చేసిన వారికీ సినిమా చూపిస్తామంటోంది. బెంగళూరు కాంగ్రెస్ ఎమ్మేల్యే మునిరత్న నాయుడు తమ పార్టీ కార్యకర్తల కోసం 4 హాళ్లలో టికెట్లు బుక్ చేశారు.
మరి వారందరి అంచనాలు అందుకోవడం లో రజని ఏ మాయ చేస్తాడో రేపు తెలుస్తుంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







