దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- October 09, 2026
దుబాయ్: దుబాయ్‌లో షేరింగ్ వసతి (Shared Accommodation) కోసం అనుమతించిన ప్రాంతాల జాబితాను దుబాయ్ మున్సిపాలిటీ వెల్లడించింది. మున్సిపాలిటీ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, నగరంలోని 44కి పైగా ప్రాంతాల్లో షేరింగ్ వసతికి అనుమతి కల్పించనున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిర్దేశిత భాగాల్లో మాత్రమే ఈ సదుపాయానికి అనుమతి ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో అనుమతించనున్నారు.
కొత్త నిబంధనల ప్రకారం..
షేరింగ్ వసతిని వ్యక్తిగత నివాసం (Individual Housing), కుటుంబ నివాసం (Family Housing) అనే రెండు విభాగాలుగా విభజించారు. ఒక నివాస యూనిట్‌ను ఈ రెండు విభాగాల్లో ఏదో ఒకదానికి మాత్రమే కేటాయించాలి. ఒకే యూనిట్‌లో రెండు రకాల వసతులను కలిపి నిర్వహించడానికి అనుమతి ఉండదు.
అలాగే, ఒక్కో వ్యక్తికి పడకగదిలో కనీసం 5 చదరపు మీటర్ల స్థలం ఉండాలి. వంటగది, బాత్‌రూమ్, భోజన సదుపాయం, విశ్రాంతి కోసం స్థలం, లాండ్రీ వంటి అవసరమైన సౌకర్యాలు కల్పించాలి.
బని యాస్ రోడ్, షేక్ జాయెద్ రోడ్, జుమేరా రోడ్, అల్ వసల్ రోడ్ వంటి పర్యాటక, వాణిజ్య ప్రాంతాల్లో కుటుంబ నివాసాలకు మాత్రమే అనుమతి ఉంటుంది.
షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాలు ఇవే..
కొన్ని నిర్దేశిత భాగాల్లో మాత్రమే అనుమతి ఉన్న ప్రాంతాలు:
- అబు హైల్ (Abu Hail)
- అల్ బరాహా (Al Baraha)
- అల్ హమ్రియా (Al Hamriya)
- మంకూల్ (Mankhool)
- అల్ జాఫిలియా (Al Jaffiliya)
- అల్ హుదైబియా (Al Hudaibiya)
- అల్ సత్వా (Al Satwa)
- పోర్ట్ సయీద్ (Port Saeed)
- హోర్ అల్ అంజ్ ఈస్ట్ (Hor Al Anz East)
- అల్ మమ్జార్ (Al Mamzar)
- అల్ ఖుసైస్ ఇండస్ట్రియల్ ఏరియా 1, 2, 3, 4, 5
- పూర్తి ప్రాంతంలో అనుమతి ఉన్న ప్రాంతాలు:
- అల్ రాస్ (Al Ras)
- అల్ దగతా – దేరా (Al Dhagata, Deira)
- అల్ బతీన్ (Al Bateen)
- సబ్ఖా (Sabkha)
- ఇయాల్ నాసర్ (Eyal Nasser)
- అల్ మురార్ (Al Murar)
- నాయిఫ్ (Naif)
- అల్ రిగ్గా (Al Rigga)
- అల్ ముతీనా (Al Muteena)
- అల్ మురఖ్కబాత్ (Al Muraqqabat)
- రిగ్గా అల్ బతీన్ – దుబాయ్ క్రీక్ సమీపం
- హోర్ అల్ అంజ్ (Hor Al Anz)
- అల్ వహీదా, దేరా (Al Waheeda, Deira)
- అల్ రషీదియా (Al Rashidiya)
- అల్ నహ్దా 1 (Al Nahda 1)
- ఖుసైస్ (Qusais)
- అల్ త్వార్ 5 (Al Twar 5)
- అల్ నహ్దా 2 (Al Nahda 2)
- ముహైస్నా 4 (Muhaisnah 4)
- సూఖ్ అల్ కబీర్ (Souq Kabeer)
- ఉమ్ హురైర్ 1, 2 (Umm Hurair 1 and 2)
- అల్ రఫా (Al Rafa)
- కరామా (Karama)
- ఔద్ మెథా (Oud Metha)
- జుమేరా 1 (Jumeirah 1)
- అల్ బదా (Al Badaa)
- బర్షా 1 (Barsha 1)
- అల్ వార్కా 1 (Al Warqa 1)
పర్మిట్ తప్పనిసరి..
షేరింగ్ వసతిగా నిర్వహించే ప్రతి ఆస్తికి సంబంధిత అనుమతి పత్రం (Permit) తప్పనిసరిగా ఉండాలి. ఇప్పటికే ఈ తరహా వసతులను నిర్వహిస్తున్న ఆస్తుల యజమానులు తమ వ్యవహారాలను కొత్త నిబంధనలకు అనుగుణంగా మార్చుకోవడానికి 2027 సెప్టెంబర్ 8 వరకు గడువు ఇచ్చారు.
నిబంధనలను ఉల్లంఘించిన వారికి కనిష్ఠంగా 500 దిర్హామ్‌ల నుంచి గరిష్ఠంగా 5 లక్షల దిర్హామ్‌ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
దుబాయ్‌లో షేరింగ్ వసతుల్లో నివసించే వారు, ఆస్తుల యజమానులు, అద్దెకు గదులు ఇచ్చే నిర్వాహకులు కొత్త నిబంధనలను తెలుసుకుని, తమ నివాసాలు అనుమతించిన ప్రాంతాల్లో ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







