త్వరగా బెజవాడ వెళ్లిపోదాం.. జగన్‌

- July 21, 2016 , by Maagulf
త్వరగా బెజవాడ వెళ్లిపోదాం.. జగన్‌

'బెజవాడ వెళ్లిపోదాం.. ఆఫీసు చూడండి' అని పార్టీ సీనియర్‌ నేతలకు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి సూచించారు. రాష్ట్ర విభజన తర్వాత దాదాపు రాజకీయ పక్షాలన్నీ విజయవాడలోనో లేదా గుంటూరులోనో పార్టీ కార్యాలయాలను తీసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ గుంటూరులో పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేసుకుంటే, కాంగ్రెస్‌ విజయవాడలోని నగర కాంగ్రెస్‌ కమిటీ కార్యాలయాన్ని రాష్ట్ర కార్యాలయంగా మార్చుకుంది. ప్రతిపక్ష వైసీపీ మాత్రం ఇంకా హైదరాబాద్‌ నుంచే కార్యకలాపాలను కొనసాగిస్తున్నది. గురువారం సీనియర్‌ నేతలతో జరిగిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. త్వరగా బెజవాడ వెళ్లిపోదాం.. పార్టీ కార్యాలయం చూడాలని సీనియర్‌ నేత సత్తిబాబుతో జగన్‌ అన్నారు. దీంతో.. ఆగస్టు 3వ తేదీ తర్వాత పార్టీ కార్యాలయాన్ని చూసేందుకు వైసీపీ నేతలు సిద్ధమయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com