పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్

- October 11, 2025 , by Maagulf
పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్

మాడ్రిడ్: పోర్చుగల్ తో వాణిజ్య సహకారం కొనసాగుతుందని కువైట్ స్పష్టం చేసింది. ఈ మేరకు కువైట్ మరియు పోర్చుగల్ మధ్య ఆర్థిక మరియు పెట్టుబడి సహకారాన్ని ప్రోత్సహించడానికి, పోర్చుగల్ మార్కెట్‌లో వ్యాపారాన్ని విస్తరించడానికి కువైట్ కంపెనీలను ప్రోత్సహించడానికి ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నట్లు పోర్చుగల్‌లోని కువైట్ రాయబారి హమద్ అల్-హజీమ్ తెలిపారు.

కువైట్ పెట్రోలియం కంపెనీ - స్పెయిన్ ఆపరేటింగ్ డైరెక్టర్ మాసిమిలియానో మైయోకో మరియు రిటైల్ మార్కెటింగ్ మేనేజర్ అబ్దుల్లా అల్-రౌమి లిస్బన్‌లోని కువైట్ రాయబార కార్యాలయంలో కువైట్ రాయబారి సమక్షంలో పోర్చుగీస్ బిజినెస్ కాన్ఫెడరేషన్ (CIP) డైరెక్టర్ జనరల్ రాఫెల్ రోచా తో సమావేశం అయ్యారు. కువైట్-పోర్చుగీస్ ఆర్థిక మరియు వాణిజ్య సంబంధాల్లో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా ఆయన ప్రశంసించారు. పోర్చుగల్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే కువైట్ కంపెనీలకు రాయబార కార్యాలయం మద్దతు, సహాయం అందిస్తూనే ఉంటుందని కువైట్ రాయబారి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com