సెవా స్మార్ట్ మీటర్స్‌తో అక్రమాలకు చెక్
- July 21, 2016
పవర్ కన్జంప్షన్ రీడింగ్స్‌ని పక్కాగా తెలుసుకునేందుకు షార్జా ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (సెవా) స్మార్ట్ మీటర్లను అమల్లోకి తెచ్చింది. ఇండస్ట్రియల్ మరియు కమర్షియల్ ప్రాజెక్టులకు తొలివిడతలో 5000 స్మార్ట్ మీటర్లను అమర్చింది. పలు ఫేజ్‌లలో మొత్తం అన్ని చోట్లా ఈ స్మార్ట్ మీటర్లను ప్రవేశపెట్టనున్నట్లు షార్జా మునిసిపాలిటీ వెల్లడించింది. సెవా 2020 ప్లాన్‌లో భాగంగా ఈ స్మార్ట్ మీటర్లను ప్రవేశపెట్టినట్లు సుప్రీం కౌన్సిల్ మెంబర్, రూలర్ ఆఫ్ షార్జా డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి చెప్పారు. సెవా ఇటీవలే మువైలా, అల్ సువైహీన్, అల్ హమిరియ్ ఫ్రీ జోన్ తదితర ప్రాంతాల్లో ఇటీవల ఇన్‌స్టాల్ చేసిన 8000 స్మార్ట్ మీటర్స్ బాగా పనిచేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఖచ్చితమైన రీడింగ్ ఈ స్మార్ట్ మీటర్ల సొంతమని చెబుతూ, ఎటువంటి అక్రమాలూ ఇకపై జరగకుండా ఉంటాయని అధికారులు వివరించారు. షార్జా రెసిడెంట్స్ కూడా స్మార్ట్ మీటర్స్‌ని స్వాగతిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







