షార్జా రోడ్లపై కొత్త రాడార్స్‌

- July 21, 2016 , by Maagulf
షార్జా రోడ్లపై కొత్త రాడార్స్‌

షార్జా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఇక నుంచి రోడ్లపై కొత్త రాడార్ల ద్వారా వాహనాల రాకపోకల్ని గమనిస్తారు. సేఫ్‌ డిస్టెన్స్‌ని లెక్క చేయకుండా వాహనాల్ని ఈ రాడార్లు గురించి, సమాచారం అందిస్తాయి. ఆ సమాచారాన్ని విశ్లేషించి పోలీసులు, వాహనదారులకు జరీమానాలు విధించడం, నిబంధనలకు అనుగుణంగా పలు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం రోడ్లపై ఉన్న రాడార్లు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో రూపొందినవే అయినా, కార్ల మధ్య దూరాన్ని పసిగట్టే ప్రోగ్రామ్‌ వీటికి చేయలేదు. కొత్త రాడార్లతో ఆ లోటు తీరుతుంది. వాహనానికీ మరో వాహనానికీ మధ్య దూరం విషయంలో నిబంధనల్ని పాటించని డ్రైవర్లకు 400 దిర్హామ్‌ల ఫైన్‌తోపాటు 4 బ్లాక్‌ పాయింట్స్‌ అతని ట్రాఫిక్‌ రికార్డ్‌లో చేర్చబడతాయి. రోడ్లపై రెక్లెస్‌గా డ్రైవ్‌ చేసేవారి పట్ల ఈ రాడార్లు ఉక్కుపాదం మోపుతాయనడం నిస్సందేహం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com