రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- October 11, 2025
హైదరాబాద్: పెట్టుబడుల పేరుతో వాట్సాప్ లింకులు పంపి ఓ వ్యక్తి నుంచి 7.88 కోట్ల రూపాయలను కాజేసిన సైబర్ నేరగాళ్ల ఉదంతమిది. వివరాలు ఇలావున్నాయి. నగరంలోని కెపిహెచ్బి ప్రాంతానికి చెందిన నగల వ్యాపారిని సత్యనారాయణ, వైశాలి అనే ఇద్దరి నంబర్ల నుంచి పెట్టుబడులంటూ వాట్సాప్ లింకు వచ్చింది. ఫినాల్డో ఇండస్ పేరుతో వున్న ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫాంలో స్టాక్ ట్రేడింగ్ పెట్టుబడులు పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని ఆశచూపారు.ఈ సంస్థ భారత్తో పాటు బ్రిటన్లలో పెద్దగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తోందని నమ్మించారు ఈ కంపెనీ వెబ్సైట్ను చూడాలని కోరారు. దీనికి స్పందించిన బాధితుడు మొదట 45 వేల రూపాయలు పంపగా కొన్ని గంటల్లోనే 15 శాతం లాభాలు వచ్చాయని చూపారు.
ఈ మొత్తాన్ని విత్ డ్రాకు ప్రయత్నించగా కేవలం 8600 రూపాయలను మాత్రమే వచ్చాయి.
మిగతా నగదు త్వరలోనే వస్తాయని సైబర్ నేరగాళ్లు నమ్మించారు.ఈ సందర్భంగా వచ్చిన లింకులను బాధితుడు ఓపెన్ చేయగా మూడు బ్యాంకు ఖాతాల నుంచి 41 విడతలుగా 7.88 కోట్ల రూపాయలను సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. అయితే దీని తరువాత లాభాలతో కలిపి 11 కోట్ల రూపాయలు వచ్చాయని సైబర్ నేరగాళ్లు నమ్మించగా అదంతా మోసమని తేలింది. దీంతో తాను మోసపో యానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేబట్టారు. కాగా బాధితుడి బ్యాంకుల నుంచి సైబర్ నేరగాళ్లు కాజేసిన నగదు దేశ వ్యాప్తంగా అనేక బ్యాంకుల్లో గల మ్యూల్ ఖాతాల ద్వారా సైబ ర్ నేరగాళ్లు మళ్లించినట్లు తేలింది. మ్యూల్ ఖాతాదారులను విచారించసాగారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







