ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- October 11, 2025
విజయవాడ: అమరావతిలో అధ్బుతమైన అత్యాధునిక వసతులతో సెంట్రల్ లైబ్రరీ నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తెలిపారు.
అమరావతిలో సెంట్రల్ లైబర్రీ నిర్మాణానికి సంబంధించి అవగాహన కలిగించేందుకు ఏర్పాటు చేసిన కార్యశాలను రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉండేలా ఐదు ఎకరాల స్థలంలో ఈ లైబ్రరీ నిర్మాణం ఉంటుందన్నారు. గతంలో హైటెక్ సిటీ నిర్మాణం ద్వారా వేలాది మందికి హైద్రాబాద్లో ఉద్యోగాలు పొందారన్నారు.
2025లో నిర్మాణం చేయబోయే ఈ లైబ్రరీ కూడా భవిష్యత్ తరాలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించేలా ఉంటుందన్నారు. ఇతర దేశాల్లో కూడా పలు లైబ్రరీలను సందర్శించి వచ్చానన్నారు. ७ వివరాలతో పాటు, నిపుణుల అభిప్రాయాలను తీసుకుని అందరికీ నచ్చేలా మెచ్చేలా గ్రంధాలయం ఉంటుందన్నారు.
దేశంలోనే అత్యాధునిక సెంట్రల్ లైబ్రరీని అమరావతిలో నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నమూనా ఎలా ఉండాలి, ఏ విధంగా రూపకల్పన చేయాలనే అంశాలపై వర్క్ షాపు నిర్వహించామన్నారు. అనేక ప్రాంతాల నుంచి నిపుణులైన ఆర్కిటెక్చరర్లు వచ్చారన్నారు. డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు, సాప్ట్ వేర్ లకు సంబంధించిన అంశాలను నిపుణులు వివరించారన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని లైబ్రరీలకు పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు తీసుకోవాల్సిన అంశాలపై నైపుణ్యం కల్గిన వారి నుంచి, వివిధ యూనివర్శిటీ ప్రొఫెసర్ల నుంచి అభిప్రాయాలను తీసుకుంటున్నామన్నారు. న్నామన్నారు. వచ్చే రెండేళ్ళల్లో ఈ సెంట్రల్ లైబ్రరీ దేశానికే ఆదర్శంగా ఉండబోతుందన్నారు. ఈ గ్రంధాలయం నిర్మాణం కోసం త్వరలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిజైన్ కాంపిటేషన్స్ నిర్వహిస్తామన్నారు.
ప్రముఖ ఆర్కిటెక్చర్లు కూడా ఈ పోటీలో పాల్గొని వివిధ నిర్మాణ ఆకృతులను కూడా అందించ వచ్చునన్నారు. అనంతరం అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, అద్భుతమైన డిజైన్తో సెంట్రల్ లైబ్రరీ నిర్మాణం రెండేళ్లలో పూర్తి అయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మోలిక వసతులు కల్పన బోర్డు చైర్మన్ రాజశేఖర్, గ్రంథాలయ సంస్థ బోర్డు డైరెక్టర్ డైరెక్టర్ రాసాని పద్మజ, రామూర్తి, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ కృష్ణ మోహన్, తదితరలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







