షార్జా రోడ్లపై కొత్త రాడార్స్
- July 21, 2016
షార్జా పోలీస్ డిపార్ట్మెంట్ ఇక నుంచి రోడ్లపై కొత్త రాడార్ల ద్వారా వాహనాల రాకపోకల్ని గమనిస్తారు. సేఫ్ డిస్టెన్స్‌ని లెక్క చేయకుండా వాహనాల్ని ఈ రాడార్లు గురించి, సమాచారం అందిస్తాయి. ఆ సమాచారాన్ని విశ్లేషించి పోలీసులు, వాహనదారులకు జరీమానాలు విధించడం, నిబంధనలకు అనుగుణంగా పలు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం రోడ్లపై ఉన్న రాడార్లు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందినవే అయినా, కార్ల మధ్య దూరాన్ని పసిగట్టే ప్రోగ్రామ్ వీటికి చేయలేదు. కొత్త రాడార్లతో ఆ లోటు తీరుతుంది. వాహనానికీ మరో వాహనానికీ మధ్య దూరం విషయంలో నిబంధనల్ని పాటించని డ్రైవర్లకు 400 దిర్హామ్‌ల ఫైన్‌తోపాటు 4 బ్లాక్ పాయింట్స్ అతని ట్రాఫిక్ రికార్డ్‌లో చేర్చబడతాయి. రోడ్లపై రెక్లెస్గా డ్రైవ్ చేసేవారి పట్ల ఈ రాడార్లు ఉక్కుపాదం మోపుతాయనడం నిస్సందేహం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







