అతి తీవ్ర ఉష్ణోగ్రతలపై హెచ్చరిక
- July 21, 2016
దుబాయ్‌లో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ పెరగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వీకెండ్ పెరిగే ఉష్ణోగ్రతల వల్ల రెసిడెంట్స్‌కి ఇబ్బందులు తప్పకపోవచ్చనీ, రెసిడెంట్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఉష్ణోగ్రతలు సుమారుగా 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చేరుకుంటాయని అధికారులు చెప్పారు. తూర్పు ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఆకస్మికంగా మేఘాలు కమ్ముకుని, వాటి కారణంగా జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. వెస్టర్న్ రీజియన్‌లో ఈ వర్షాల కారణంగా విజిబిలిటీ తగ్గుతుందని అధికారులు వివరించారు. రానున్న రెండు రోజుల్లో సముద్రం ఒకింత అల్లకల్లోలంగా ఉండే అవకాశముందని, సముద్ర తీర ప్రాంతాల్లో సేద తీరాలనుకునేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







