మహిళా ఫార్ములా 4 రేసర్

- October 13, 2025 , by Maagulf
మహిళా ఫార్ములా 4 రేసర్

హిమాచల్ ప్రదేశ్ మండీ జిల్లాకు చెందిన 17 ఏళ్ల శ్రేయ లోహియా భారత మోటార్ స్పోర్ట్స్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం రాసింది. ఆమె భారతదేశంలోనే తొలి మహిళా ఫార్ములా 4 రేసర్గా నిలిచింది.

శ్రేయ సాధించిన విజయాలు యువతకు, ప్రత్యేకంగా అమ్మాయిలకు, ప్రతిరంగంలో రాణించగలరని స్ఫూర్తి ఇస్తున్నాయి. చిన్నప్పటినుండి ఆమె కార్టింగ్ రేసింగ్తో ఆసక్తి చూపుతూ, 9 ఏళ్ల వయసులో కార్టింగ్ కారును నడిపి అనుభవాన్ని సంతరించుకుంది.

శ్రేయ తల్లిదండ్రులు రితేశ్ మరియు వందన లోహియా, ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ప్రతి దశలో ఆమెకు మద్దతు అందించారు. చిన్న వయసులోనే కార్టింగ్‌లోకి తీసుకు వెళ్ళి, ప్రోత్సహించి, అంచెలంచెలుగా శ్రేయను దేశంలోనే ఫార్ములా 4 రేసర్‌గా నిలిపారు.

ఇప్పటి వరకు ఆమె 30కు పైగా పోడియం ఫినిషింగ్‌లు సాధించింది. 2024లో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ జట్టుతో భారత ఫార్ములా 4 ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని, నాలుగుసార్లు ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా నుండి సత్కరించబడింది.

రేసింగ్‌తో పాటు, శ్రేయ 12వ తరగతి సైన్స్ విద్యార్థినిగా చదువులోనూ చురుకుగా ఉంది. కాలేజీకి వెళ్లకపోయినా ఇంట్లో ప్రిపేర్ అవుతూ పరీక్షలు రాస్తోంది.తన తండ్రి తెలిపారు, శ్రేయ మనాలి హిమాలయన్ ర్యాలీకి సిద్ధమవుతోంది, వచ్చే ఏడాది 18 ఏళ్లు నిండిన తర్వాత అధికారికంగా పాల్గొంటుంది. అలాగే, రాబోయే 2-3 నెలల్లో ఫార్ములా రేసింగ్ కోసం విదేశాలకు వెళ్ళనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com