ఆర్యన్ నుంచి ఐయామ్ ది గాయ్ సాంగ్ రిలీజ్
- October 13, 2025
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో విష్ణు విశాల్, విష్ణు విశాల్ స్టూడియోస్, శుభ్ర & ఆర్యన్ రమేష్ లతో కలిసి నిర్మించిన 'ఆర్యన్' అనే గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్ కె దర్శకత్వం వహించారు. మేకర్స్ ఇటీవల టీజర్ ను విడుదల చేశారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది.
ఈ రోజు మేకర్స్ ఐయామ్ ది గాయ్ సాంగ్ రిలీజ్ చేశారు. జిబ్రాన్ స్వరపరిచిన ఈ పాటనకు సామ్రాట్ సాహిత్యం అందించారు. జిబ్రాన్, శ్రీకాంత్ హరిహరన్ అద్భుతంగా పాడారు. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఆర్యన్ చిత్రం అక్టోబర్ 31న విడుదల కానుంది. హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శ్రేష్ట్ మూవీస్ ద్వారా విడుదల చేయనున్నారు. అనేక బ్లాక్ బస్టర్లను అందించిన ప్రొడక్షన్ , డిస్ట్రిబ్యూషన్ బ్యానర్ మద్దతుతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. శ్రేష్ట్ మూవీస్ గతంలో విక్రమ్, అమరన్, థగ్ లైఫ్ వంటి చిత్రాలను విడుదల చేశారు.
సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. సాయి రోనక్, తారక్ పొన్నప్ప, మాల పార్వతి, అవినాష్, అభిషేక్ జోసెఫ్ జార్జ్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు.
విష్ణు విశాల్ FIR చిత్రానికి దర్శకత్వం వహించిన మను ఆనంద్ ఈ చిత్రానికి సహ రచయితగా పనిచేశారు. హరీష్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా, గిబ్రాన్ సంగీతం, శాన్ లోకేష్ ఎడిటర్.
ట్రైలర్, ఆడియో లాంచ్‌కు సంబంధించిన అప్డేట్లు త్వరలో అనౌన్స్ చేస్తారు.
తారాగణం - విష్ణు విశాల్, సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి
నిర్మాణం - విష్ణు విశాల్ (విష్ణు విశాల్ స్టూడియోస్)
దర్శకత్వం - ప్రవీణ్ కె
నిర్మాతలు - శుభ్ర, ఆర్యన్ రమేష్, విష్ణు విశాల్
తెలుగు రిలీజ్: శ్రేష్ట్ మూవీస్
DOP - హరీష్ కన్నన్.
సంగీతం - జిబ్రాన్.
ఎడిటర్ - శాన్ లోకేష్.
స్టంట్స్ - స్టంట్ సిల్వా, పిసి స్టంట్స్ ప్రభు.
ఎడిషల్ స్క్రీన్ ప్లే - మను ఆనంద్.
ప్రొడక్షన్ డిజైన్ - ఎస్.జయచంద్రన్.
కాస్ట్యూమ్ డిజైనర్, స్టైలిస్ట్ - వినోద్ సుందర్
పీఆర్వో: వంశీ శేఖర్
తాజా వార్తలు
- దుబాయ్‌లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్‌నగర్‌లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్
- ఖతార్‌లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్‌లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్‌లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్‌లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!







