ఒమన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 17 మందికి గాయాలు..!!

- November 23, 2026 , by Maagulf
ఒమన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 17 మందికి గాయాలు..!!

మస్కట్: ఒమన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రక్కులు, ఓ ప్రయాణికుల బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో 17 మంది గాయపడ్డారు. సుల్తాన్ సయీద్ బిన్ తైమూర్ రోడ్డులోని హైమా–తుమ్రైత్ మార్గంలో ఈ ప్రమాదం జరిగినట్లు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) వెల్లడించింది. సోమవారం తెల్లవారుజామున సుమారు 1.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. మొదట రెండు ట్రక్కులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆ తర్వాత 26 మందితో ప్రయాణిస్తున్న బస్సు వాటిలోని ఓ ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.

సమాచారం అందుకున్న రాయల్ ఒమన్ పోలీస్, సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన 17 మందికి వివిధ స్థాయిల్లో గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైమా, నిజ్వా, ఆదమ్‌లోని ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com