'మైసా'కి స్టార్ కంపోజర్ జేక్స్ బిజోయ్ మ్యూజిక్
- October 15, 2025
నేషనల్ క్రష్ రష్మిక మందన్న రవీంద్ర పుల్లె డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్న 'మైసా' అనే పవర్‌ఫుల్, ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తో రాబోతున్నారు. ఈ చిత్రం ఇప్పటికే ఆసక్తికరమైన టైటిల్, అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో బజ్‌ను సృష్టించింది. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ మైసాను భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
మేకర్స్ ఒక ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. బ్లాక్ బస్టర్ సరిపోదా శనివారం ఫేం జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా జేక్స్ బిజోయ్ ట్రైబల్ వాయిద్యాలతో రీరికార్డింగ్ చేస్తున్న విడియో రిలీజ్ చేశారు. సౌండింగ్ అదిరిపోయింది. మైసా మ్యూజికల్ గా గ్రాండ్ స్కేల్ లో వుండబోతుంది.
మైసా గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో హై-ఆక్టేన్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతోంది. రష్మిక మందన్న ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఇంటెన్స్ అవాతర్ లో కనిపిస్తుంది.
ఈ చిత్రానికి సూర్య ‘రెట్రో’ సినిమాకి పని చేసిన శ్రేయాస్ పి కృష్ణ డీవోపీగా పని చేస్తున్నారు. యాక్షన్ ని ‘కల్కి 2898 ఏ డీ’ ఫేమ్ ఆండి లాంగ్ డిజైన్ చేస్తున్నారు.
మరిన్ని ఎక్సైటింగ్ అప్‌డేట్స్ మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
తారాగణం: రష్మిక మందన్న
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రవీంద్ర పుల్లె
నిర్మాతలు: అన్‌ఫార్ములా ఫిల్మ్స్
మ్యూజిక్: జేక్స్ బిజోయ్
డీవోపీ: శ్రేయాస్ పి కృష్ణ
స్టంట్స్: ఆండీ లాంగ్
PRO: వంశీ-శేఖర్
డిజిటల్: హాస్టాగ్ మీడియా
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్
- సినీ లోకానికి తీరని విషాదం..సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు
- ఎన్ఆర్ఐలకు డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు
- తెలంగాణలో బతుకమ్మ సందడి..
- మెన్స్ హాకీ ఫైనల్లో భారత్ ఘన విజయం
- ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్‌ను పరామర్శించిన షేక్ హమ్దాన్దు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!







