కబాలి సినిమా టికెట్లు పంచిపెట్టిన కిరణ్ బేడీ
- July 22, 2016
కబాలి సినిమా మానియా రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత గవర్నర్ చేత కూడా ఆశ్చర్యకరమైన పని చేయించింది. స్వయంగా లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కబాలి సినిమా టెకెట్లను ప్రజలకిచ్చి మూవీ చూడమని చెప్పిన ఘటన పాండిచ్చేరిలో జరిగింది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా బీజేపీ పార్టీ తరుపున ఎంపికైన కిరణ్ బేడి పాండిచ్చేరిలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆమె ప్రజలను అభివృద్ది వైపు నడిపించేందుకు తన వంతు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా సొంత ఇళ్లల్లో టాయిలెట్లు కట్టించుకున్న వారిని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రస్తుతం కబాలి ప్రభావం దక్షిణ భారతం మొత్తం ఆవహించి ఉందన్న విషయాన్ని గుర్తించిన ఆమె అందుకు తగ్గట్టుగానే నిర్ణయం తీసుకున్నారు. సొంత ఇళ్లలో టాయిలెట్లు కట్టించుకున్న వారికి ప్రోత్సాహకంగా కబాలి టెకెట్లు ఇచ్చారు. కబాలి మానియా దాదాపు దక్షిణ భారతదేశమంతటా వైరల్‌గా ఉంది. తమిళనాడు, పాండిచ్చేరిలో కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో ఈ ప్రజల్లో ఉండే ఈ క్రేజ్‌ను లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఈ విధంగా వినియోగించారు పాండిచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







