జార్ఖండ్‌లో మోదీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఇద్దరు అరెస్ట్ చేసిన సీబీఐ
- July 22, 2016
ప్రధాని నరేంద్ర మోదీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఇద్దరిని సీబీఐ శుక్రవారం అరెస్ట్ చేసింది. పండిట్ స్వరాజ్ కుమార్ రాయ్, సువెందు కుమార్ బర్మన్‌ను జార్ఖండ్‌లో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాయ్, బర్మన్‌తో కలిసి 2015 మే నెలలో ప్రధాని మోదీ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. ఆగస్ట్ 15 వేడుకల్లో సంగీత కచేరి నిర్వహించాలని ప్రధాని మోదీ తనకు లేఖ రాసినట్లు అధికారులకు చూపాడు.
అనుమానం వ్యక్తం చేసిన నిర్వాహకులు దానిపై పీఎంవో కార్యాలయం నుంచి ఆరా తీశారు. దీంతో అది ఫోర్జరీ లేఖగా తేలింది. దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతో ఎట్టకేలకు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. బెంగాల్‌లో వారు ఫోర్జరీకి పాల్పడిన మరి కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను సీబీఐ కోర్టులో హాజరుపర్చగా జులై 27 వరకు కస్టడీకి అనుమతించింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







