అమెరికాలో దీపావళి సంబరాలు..NRI సేవలను కొనియాడిన మేయర్

- October 17, 2025 , by Maagulf
అమెరికాలో దీపావళి సంబరాలు..NRI సేవలను కొనియాడిన మేయర్

అమెరికా: అమెరికాలో దీపావళి పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రతి ఏడాది ఎంతో వైభవంగా దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో అమెరికా రాజకీయ నాయకులు, మేయర్లు, రాష్ట్ర గవర్నర్లు పాల్గొని, ప్రవాస భారతీయులకు శుభాకాంక్షలు తెలియజేస్తారు.అమెరికా అభివృద్ధిలో పోషిస్తున్న కీలక పాత్రను వారు ప్రత్యేకంగా గుర్తించి, ప్రశంసలతో అభినందిస్తారు.

న్యూయార్క్ నగరంలో ఘనంగా దీపావళి వేడుకలు నిర్వహించబడ్డాయి. న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ తన అధికారిక నివాస స్థలమైన గ్రేసీ మాన్షన్లో దీపావళి వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకల్లో మేయర్ మాట్లాడుతూ, న్యూయార్క్ నగర సాంస్కృతిక, ఆర్థిక ప్రగతిలో భారతీయ సమాజం నిర్వహిస్తున్న పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు ఎరిక్ ఆడమ్స్ (Eric Adams).

భారత కాన్సులేట్ జనరల్ తరఫున ఈ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ కాన్సుల్ జనరల్ విశాల్ జయేష్‌భాయ్ హర్ష్.. వెలుగు, ఆశ, ఆనందానికి ప్రతీకైన దీపావళి సందేశాన్ని అందరికీ తెలియజేశారు.మరోవైపు న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ ఫ్లషింగ్‌లోని శ్రీ స్వామినారాయణ మందిరంలో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

ప్రవాస భారతీయులకు నిరంతరం మద్దతు ఇస్తున్నందుకు గవర్నర్‌కు కాన్సులేట్ అధికారులు ధన్యవాదాలు తెలిపారు. ఫ్లోరిడాలోని టల్లాహస్సీలో ఉన్న ఫ్లోరిడా క్యాపిటల్‌లో మొట్టమొదటిసారిగా దీపావళి సంబరాలు నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర అధికారులు, ప్రవాస భారతీయ ప్రముఖులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com