హెచ్ 1బీ వీసాపై కోర్టులో సవాల్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్
- October 17, 2025
హెచ్ 1బీ వీసాపై కోర్టులో సవాల్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్
అమెరికా: యూఎస్ హెచ్ 1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై చాలానే గందగోళం రేగింది. భారత్, చైనా దేశాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. దాంతో పాటూ లాటరీ విధాన్ని తీసేస్తామని కూడా ప్రకటించింది ట్రంప్ ప్రభుత్వం. దీని వలన అమెరికాలో ఉన్న టెక్ కంపెనీలే నష్టపోతాయన్నది వాస్తవం. అయితే ఇప్పటి వరకూ ఏ కంపెనీ కూడా ట్రంప్ ను హెచ్ 1బీ వీసాల విషయమై ప్రశ్నించలేదు.
అయితే ఇప్పుడు 3లక్షల మంది వ్యాపారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై దావా వేసింది. ఆయన అధికార పరిధికి మించి నిర్ణయాన్ని తీసుకున్నారని అందులో ఉటంకించింది. డీసీలోని ఫెడరల్ కోర్టులో ఈ దావా ఫైల్ అయింది. కాంగ్రెస్ తీసుకొచ్చిన సంక్లిష్టమైన వీసా వ్యవస్థను ఇది దెబ్బతీస్తోందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆందోళన వ్యక్తం చేసింది. దీని వలన చాలా కంపెనీలు నష్టపోతున్నాయని…తక్కవు నైపుణ్యం కలవారిని నియమించుకోవాల్సి వస్తుందని చెబుతోంది. అంతేకాదు ఈ నిర్ణయం వలన హెచ్-1బీ ఉద్యోగులను బలవంతంగా తగ్గించుకొనే పరిస్థితి ఏర్పడింది. ఇది వారి పెట్టుబడిదారులతో పాటు కస్టమర్లు, సొంత ఉద్యోగులపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోందని వాదించింది.
అమెరికాలో ఉన్న మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, మెటా, వాల్ మార్ట్ వంటి దిగ్గజ సంస్థలతో సహా దేశంలోనే అత్యధిక కంపెనీల సభ్యత్వం కలిగిన వ్యాపార సంస్థల లాబీ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఇది పోరాటంలోకి దిగితే ఎదురు నిలబడడం కాస్త కష్టమే. ఇప్పటి వరకు టెక్ కంపెనీలు విడిగా ట్రంప్ హెచ్ 1బీ వీసా ఫీజు పెంపుపై వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. కానీ ఇప్పుడు వారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో కలిసి పోరాటానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గనుక కేసు వేస్తే, ట్రంప్ తో వీరు కోర్టులో పోరాడటం ఇది రెండోసారి అవుతుంది. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను నిలిపివేశారు. అప్పుడు కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆయనపై ఫెడరల్ కోర్టు కేసు వేసి గెలిచింది. ఫెడరల్ కోర్టు ట్రంప్ ఆదేశాలను రద్దు చేసింది.
ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై దాదాపు అన్ని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హెచ్ 1బీ వీసాతో టెక్ కంపెనీలు తక్కువ జీతాలకు విదేశీ ఉద్యోగులను నియమించకుంటున్నాయని…దాని వలన అమెరికాలో జనాలకు ఉద్యోగాలు తక్కువ అయిపోతున్నాయన్నది ట్రంప్ వాదన. ఇప్పుడు తాను తీసుకున్న నిర్ణయంవలన అమెరికా ప్రజలతో పాటూ టెక్ కంపెనీలు కూడా సంతోషిస్తాయని అన్నారు. కానీ నిజానికి అవన్నీ కూడా ఈ నిర్ణయంపై విపరీతమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కంపెనీల సామర్థ్యం తగ్గిపోయే అవకాశం ఉందని భయపడుతున్నాయి. అందుకే ఇప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో కలిసి పోరటానికి సిద్ధమయ్యాయని తెలుస్తోంది. దీంతో పాటూ పలు సంఘాలు కూడా హెచ్ 1బీ వీసా ఫీజులకు వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించాయి.
H-1B వీసా రుసుము ఎంత?
$100,000
వారు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, లేకుంటే మేము భర్తీ చేయబడము.” ఇప్పుడు H-1B వీసా దరఖాస్తుల కోసం కొత్త $100,000 రుసుము దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో కవర్డేల్ వంటి వారికి ఇబ్బందిని కలిగిస్తుంది, వారు విద్య మరియు ఆరోగ్య సంరక్షణ వంటి నైపుణ్యం కలిగిన వృత్తులలో ఖాళీలను భర్తీ చేయడానికి వలసదారులపై ఆధారపడతారు.
H-1B వీసాకు ఎవరు అర్హులు?
H-1B వీసాకు అర్హత పొందాలంటే, ఒక విదేశీ కార్మికుడు తప్పనిసరిగా US యజమాని నుండి "స్పెషాలిటీ వృత్తి"లో ఉద్యోగ ఆఫర్ను కలిగి ఉండాలి, దీనికి సాధారణంగా బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ లేదా దానికి సమానమైన అర్హత అవసరం.
తాజా వార్తలు
- మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో అత్యాధునిక ట్రామా సేవలకు నూతన ప్రమాణం
- ఒమన్ పై UNICEF ప్రశంసలు..!!
- కంపెనీలు వేజ్ సపోర్టును దుర్వినియోగం చేస్తున్నాయా?
- సౌదీలో భారీగా క్యాప్తగోన్ పిల్స్ పట్టివేత..!!
- గల్ఫ్- తిరువనంతపురం మధ్య ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- QR16.68 బిలియన్ల విలువైన 55 మిలియన్లకు పైగా లావాదేవీలు..!!
- 'కువైట్ వీసా' ప్లాట్ఫామ్..భారీగా విజిట్ వీసాలు జారీ..!!
- మెడికల్ విద్యార్థులకు శుభవార్త–ఏపీలో 250 కొత్త ఎంబీబీఎస్ సీట్లు
- కొత్త ODI జెర్సీ విడుదల
- ‘శ్వాస స్వర సంధ్య' తో ఈలపాట మాంత్రికుడు పద్మశ్రీ డా.శివప్రసాద్ మాయాజాలం