సినిమా రివ్యూ: ‘తెలుసు కదా’
- October 17, 2025
ఫ్యాన్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, రాశిఖన్నా, శ్రీనిధి శెట్టి నటించిన తాజా చిత్రమే ‘తెలుసు కదా’. స్టైలిస్ట్ అయిన నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా మారారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కి, రిలీజ్‌కి ముందు మంచి అంచనాలు నమోదు చేసుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
ఓ పెద్ద రెస్టారెంట్‌లో షెఫ్‌గా పని చేసే వరుణ్ (సిద్దు జొన్నలగడ్డ) లవ్‌లో ఫెయిలవుతాడు. ఆ సంఘటన నుంచి ఎలాగో బయటపడి పెద్దలు చూసిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. పెళ్లిచూపుల్లో చూసి అంజలి(రాశీ ఖన్నా)ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు వరుణ్. అంతా సవ్యంగానే వుంటుంది. కానీ, పెళ్లి తర్వాత అంజలి తల్లి కావడం కష్టమని తెలుస్తుంది. ఈ క్రమంలో ఐవీఎఫ్‌ని అప్రోచ్ అవుతారు వరుణ్, అంజలి జంట. అక్కడ ఐవీఎఫ్ డాక్టర్‌గా రాగ (శ్రీనిధి శెట్టి)ని కలుస్తాడు. కట్ చేస్తే, రాగ తనను మోసం చేసిన ఎక్స్ గాళ్ ఫ్రెండ్ అని తెలిసి షాకవుతాడు. అయితే, భార్య అంజలికి పిల్లల కోసం రాగతో ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఓ వైపు ప్రేమించిన అమ్మాయ్, మరోవైపు పెళ్లి చేసుకున్న అమ్మాయ్.. ఈ ఇద్దరినీ వరుణ్ ఎలా ఫేస్ చేశాడు.? అసలు కథ ఏ మలుపు తీసుకుంది.? ఎలా సుఖాంతమైంది.? అనేది తెలుసుకోవాలంటే, ‘తెలుసు కదా’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.!
నటీనటుల పనితీరు:
దాదాపు ‘టిల్లు’ లాంటి ఫార్మేట్‌లోనే సిద్దు జొన్నలగడ్డ పాత్ర వుండడంతో చాలా ఈజ్‌తో చేసేశాడు. అయితే, కథ పరంగా చూస్తే ఈ సినిమా కథ పూర్తి విభిన్నం. రెగ్యులర్ ఫార్మేట్‌గా చాలా దూరంగా వుంది. గతంలో చాలానే ఈ తరహా ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ చూశాం. కానీ, ‘తెలుసు కదా’ కథనం మాత్రం ఆసక్తికరంగా కొత్తగా నడిపించారు. సిద్దు జొన్నలగడ్డ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. రాశి ఖన్నాకి మరో మంచి పాత్ర దక్కింది అంజలిగా ఈ సినిమాలో. ఎమోషన్స్ బాగా పండించింది. అలాగే గ్లామర్ సీన్స్‌లోనూ చెలరేగిపోయింది. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మరో హీరోయిన్ శ్రీనిధి శెట్టికి కాస్త స్పేస్ తక్కువే. కానీ వున్నంతలో తన పాత్రకు న్యాయం చేసింది. న్యూ లుక్స్‌లో కనిపించి మెప్పించింది. వైవాహర్ష, సిద్దు జొన్నలగడ్డ మధ్య కామెడీ ట్రాక్ బాగా పండింది. కనిపించినంత సేపూ నవ్వులు పూయించాడు. మిగిలిన పాత్రధారులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
ఈ సినిమాకి కథ, కథనంతో పాటూ, టెక్నికల్ టీమ్ వర్క్ కూడా బాగా సెట్టయ్యింది. మొదటగా థమన్ తన మెలోడీ మ్యూజిక్‌తో ఆకట్టుకున్నాడు. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చక్కగా కంపోజ్ చేశాడు. పాటలు బాగున్నాయ్. బీజీఎమ్ బాగుంది. నీరజ కోన ఎంచుకున్న కథ పాతదే అయినా.. కథనం కొత్తగా నడిపించిన తీరు మెచ్చుకోక తప్పదు. లాగ్ లేకుండా జాగ్రత్త పడింది. డైలాగులు బాగున్నాయ్. ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్లుగా వుంది. నిర్మాణ విలువలు బాగున్నాయ్. ఓవరాల్‌గా టెక్నికల్ టీమ్ సపోర్ట్ బాగుంది.
ప్లస్ పాయింట్స్:
సిద్దు జొన్నలగడ్డ పర్‌ఫామెన్స్, కథలోని కొన్నికొత్తగా అనిపించిన ట్విస్టులు, యూత్‌కి బాగా కనెక్ట్ అయిపోయేలా వున్న కొన్ని సన్నివేశాలు.. కామడీ ట్రాక్.. ఇంట్రెస్టింగ్ సెకండాఫ్ అండ్ క్లైమాక్స్..
మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్ అక్కడక్కడా కొంత మేర బోరింగ్ అనిపించినా ఓవరాల్ ఇంటెన్స్ మెచ్చుకోవాలి.
చివరిగా:
‘తెలుసు కదా’ మరోసారి సిద్దు జొన్నలగడ్డ యూత్‌ని టార్గెట్ చేశాడు. అందులో హండ్రెడ్ పర్సంట్ సక్సెస్ అయ్యాడు. మరి, ఫ్యామిలీ ఆడియన్స్ సంగతి తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ప్రయాణికులకు అలెర్ట్..దోహా మెట్రో లింక్ సర్వీస్ అప్డేట్..!!
- రియాద్‌లో జాయ్ ఫోరం 2025..SR4 బిలియన్ ఒప్పందాలు..!!
- ఫ్లైట్ లో లిథియం బ్యాటరీ పేలుడు..ప్రయాణికులు షాక్..!!
- ఒమన్ లో వైభవంగా దీపావళి వేడుకలు..!!
- బహ్రెయిన్ పోస్ట్ మొబైల్ పోస్టల్ సేవలు ప్రారంభం..!!
- కెపిటల్ గవర్నరేట్‌లో భద్రత, ట్రాఫిక్ క్యాంపెయిన్..!!
- దుబాయ్ లో దీపావళి సెలబ్రేషన్స్..Dh5లక్షల విలువైన బహుమతులు..!!
- ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఒమన్..!!
- గ్లోబల్ మార్కెట్లో సత్తా చాటుతున్న భారత్
- కువైట్ లో వేగంగా మారుతున్న వాతావరణం..!!