సినిమా రివ్యూ: ‘డ్యూడ్’
- October 17, 2025
‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ సినిమాలతో తెలుగు ఆడియన్స్‌నీ బాగా ఎట్రాక్ట్ చేసిన తమిళ కుర్రోడు ప్రదీప్ రంగనాధన్. ముచ్చటగా మూడోసారి ‘డ్యూడ్’ చిత్రంతో తెలుగు నాట అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. ‘ప్రేమలు’ సినిమాతో పాపులర్ అయిన మమితా బైజు ఈ సినిమాలో ప్రదీప్‌కి జంటగా నటించింది. తెలుగు రాష్ట్రాల్లో బీభత్సంగా ప్రమోట్ చేశారు ఈ సినిమాని. ఓ డబ్బింగ్ సినిమా అన్నట్లుగా కాకుండా స్ర్టెయిట్ మూవీ బిల్డప్‌తో ప్రమోషన్లు చేశారు. మైత్రీ మూవీస్ ఈ సినిమా బాధ్యతలు తీసుకోవడం అందుకు ఓ కారణం కావచ్చు. మరి, తెలుగు ఆడియన్స్‌లో ఈ సినిమా ఎంత మేర సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయో తెలియాలంటే ముందుగా కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
పశు సంవర్ధక శాఖ మంత్రి ఆది కేశవులు (శరత్ కుమార్)కి మేనల్లుడైన గగన్ (ప్రదీప్ రంగనాధన్).. ఓ లవ్ ఫెయిల్యూర్ కుర్రోడు. ఆదికేశవులకి మేనల్లుడంటే ప్రాణం. ఆయన కూతురు కుందన. చిన్నప్పట్నుంచీ బావను ఇష్టపడుతుంది. అదే విషయం గగన్‌కి చెప్పగా ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్‌లో వున్న గగన్, కుందన ప్రేమను తిరస్కరిస్తాడు. అయితే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య కుందన మీద గగన్‌కి ప్రేమ పుడుతుంది. నేరుగా మామయ్య దగ్గరికి వెళ్లి ఆ విషయం చెబుతాడు. మేనమామ ఒప్పుకుంటాడు. కూతురునిచ్చి పెళ్లి చేయడానికి కూడా రెడీ అవుతాడు. కానీ, అంత సులువుగా వీరి పెళ్లి జరగదు. కొన్ని ట్విస్టుల మధ్య పెళ్లయితే జరుగుతుంది. కానీ, పెళ్లి తర్వాత జరిగే పరిణామాలు కూడా తీవ్రంగానే వుంటాయ్. ఒకానొక టైమ్‌లో ప్రాణంగా ప్రేమించిన కుందనే, బావతో పెళ్లి వద్దంటుంది. పెళ్లి తర్వాత గగన్ ఓ త్యాగం చేయాల్సి వస్తుంది.? ఆ త్యాగం ఏంటీ.? అసలు కుందన పెళ్లి ఎందుకు వద్దంది.? వీరి వైవాహిక జీవితం సవ్యంగానే సాగిందా.? ఎలాంటి సమస్యల్ని హీరో ఎదుర్కోవాల్సి వచ్చింది.? ఈ విషయాలన్నీ తెలియాలంటే ‘డ్యూడ్’ ధియేటర్లలో చూడాల్సిందే.
నటీ నటుల పనితీరు:
తొలి రెండు చిత్రాలతోనూ ప్రదీప్ తన టాలెంట్ చూపించేసుకున్నాడు. తన బలం కామెడీ.. అదే ఈ సినిమాకీ కొనసాగించాడు. ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. అయితే, కథలో బలం కాస్త తగ్గిందని చెప్పొచ్చు. అయితే కథనంతో దాన్ని కవర్ చేయొచ్చు. కానీ, అది ఈ సినిమాలో జరిగినట్లు కనిపించదు. రెగ్యులర్ ఫార్మేట్ నెరేషన్‌తో దర్శకుడు సినిమాని లాగించేశాడు. హీరోయిన్‌గా నటించిన మమితా బైజు మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ చేసుకుంది. కానీ, మంచి స్కోపున్న ఈ పాత్రను ఇంకాస్త బాగా డిజైన్ చేసి వుంటే బాగుండేదన్న అభిప్రాయాలొస్తున్నాయ్. శరత్ కుమార్ పాత్ర ఈ సినిమాలో ఓ సర్‌ప్రైజింగ్. హీరో పాత్రకు ధీటుగా ఎంటర్‌టైన్‌మెంట్ టచ్‌గా డిజైన్ చేశారు. ఆ పాత్రలో ఆయన చక్కగా ఒదిగిపోయారు. నేహాశెట్టి ఓ చిన్న పాత్రలో తళుక్కున మెరిసింది. మిగిలిన పాత్రధారులు తమ పాత్రల్లో బాగానే నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
కీర్తీశ్వరన్ ఈ సినిమాని ప్రదీప్ యాంగిల్ నుంచి చాలా స్టైలిష్‌గా తెరకెక్కించాడనే చెప్పొచ్చు. అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా చక్కగానే కుదిరాయ్. కానీ, మధ్యలో రెగ్యులర్ ఫార్మేట్‌లోకి కథనం టర్న్ తీసుకుంటుంది. అదే కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే, అది సెట్టయ్యేదేమో అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. సినిమాటోగ్రఫీ ఓకే. మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమాని ప్రెస్టీజియస్‌గా ఎక్కడా రాజీ పడకుండా రిచ్‌గా రూపొందించారు.
ప్లస్ పాయింట్స్:
కామెడీ, ప్రదీప్ రంగనాధన్ మరియు శరత్ కుమార్ పాత్రలు, అక్కడక్కడా టచ్ చేసే ఎమోషనల్ సన్నివేశాలు, స్టైలిష్ మేకింగ్..
మైనస్ పాయింట్స్:
సాగతీత సన్నివేశాలు.. రొటీన్ కథనం..
చివరిగా:
‘డ్యూడ్’ పేరుకు తగ్గట్లు అని పూర్తిగా చెప్పలేం కానీ, ఓ మోస్తరు యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.!
తాజా వార్తలు
- దుబాయ్ లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్..వాహనం సీజ్..!!
- ఇబ్రి గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం..తప్పిన ప్రాణాపాయం..!!
- భవనాల సబ్ డివజన్ కి SR25వేల గరిష్ట జరిమానా..!!
- హైదరాబాద్ లో భారీగా గోల్డ్ బార్స్ స్వాధీనం..!!
- ప్రైవేట్ పాఠశాలలకు BD100,000 వరకు జరిమానాలు..!!
- ఖతార్ లో పుంజుకున్న రెసిడెన్షియల్ రెంటల్ మార్కెట్..!!
- తిరుమల లడ్డూ ధర పెంపు వార్తలు అవాస్తవం: బీఆర్ నాయుడు
- ఆన్లైన్ షాపింగ్ లవర్లకు..బిగ్ అలెర్ట్
- శబరిమల బంగారం మాయం: ప్రధాన నిందితుడు అరెస్ట్
- అమెరికాలో దీపావళి సంబరాలు..NRI సేవలను కొనియాడిన మేయర్