ఆన్లైన్ షాపింగ్ లవర్లకు..బిగ్ అలెర్ట్
- October 17, 2025
హైదరాబాద్: దీపావళీ సీజన్ మొదలవడంతో ఆన్లైన్ షాపింగ్ ఉత్సాహం పెరిగింది. అయితే, ఈ ఉత్సవ కాలంలో సైబర్ నేరగాళ్లు చురుకుగా మారుతున్నారని రాచకొండ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకంగా ఆన్లైన్ షాపింగ్ లవర్స్ తమ వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పోలీసుల ప్రకారం, నేరగాళ్లు AnyDesk వంటి రిమోట్ యాక్సెస్ యాప్‌లను ఉపయోగించి ప్రజల ఫోన్లలోకి చొరబడి, పర్సనల్ డేటా, ఫొటోలు, బ్యాంకు వివరాలు దోచేస్తున్నారు. కొందరు తెలియకుండానే APK ఫైల్స్ లేదా లింకులు క్లిక్ చేయడం వల్ల వారి ఫోన్లకు పూర్తి యాక్సెస్ దొరుకుతుందని తెలిపారు.
“అజ్ఞాత లింకులు లేదా అప్లికేషన్ ఫైల్స్‌పై క్లిక్ చేయకండి. వాట్సాప్‌లో ఆటో డౌన్లోడ్ ఆప్షన్‌ను డిసేబుల్ చేయండి. ఫోన్ గ్యాలరీలో పర్సనల్ ఫోటోలు, బ్యాంక్ కార్డ్ వివరాలు స్టోర్ చేయవద్దు,” అని పోలీసులు సూచించారు. అలాగే, ఎవరైనా రిమోట్ యాప్ ఇన్స్టాల్ చేయమని అడిగితే వెంటనే నిరాకరించాలని, ఆ రకమైన కాల్స్ లేదా మెసేజ్‌లు వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీసులు హెచ్చరిస్తూ–“దీపావళీ ఆఫర్ల పేరిట నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. ఒక్క క్లిక్‌తో మీ సమాచారం, మీ డబ్బు వారి చేతుల్లోకి వెళ్లిపోవచ్చు,” అన్నారు.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







