హైకోర్టు జడ్జిగా జస్టిస్ రమేష్ ప్రమాణం
- October 18, 2025
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ దొనాడి రమేశ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈమేరకు శుక్రవారం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ రమేశ్ చే న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు. గతంలో ఎపి హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తూ జస్టిస్ రమేశ్ అలహాబాద్ హైకో ర్టుకు బదిలీ అయ్యారు.
మరలా ఎపి హైకోర్టుకు న్యాయమూర్తిగా తిరిగి బదిలీ కావడంతో ఆయనతో చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయ మూర్తులు, హైకోర్టు అడ్వకేట్ జనరల్ దమ్మాల పాటి శ్రీనివాస్, అదనపు సొలిసిటర్ జనరల్ ధనంజయ, అదనపు అడ్వకేట్ జనరల్ ఐ సాంబశివ ప్రతాప్, రిజిస్ట్రార్ జనరల్ వైవిఎస్బిజి పార్ధసారధి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.చిదంబరం, ఎపి బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఎన్. ద్వారకానాధ్ రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్, పలువురు రిజిస్ట్రార్లు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ ప్రతినిధులు తది తరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో దీపావళి సెలబ్రేషన్స్..Dh5లక్షల విలువైన బహుమతులు..!!
- ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఒమన్..!!
- గ్లోబల్ మార్కెట్లో సత్తా చాటుతున్న భారత్
- కువైట్ లో వేగంగా మారుతున్న వాతావరణం..!!
- బహ్రెయిన్ లో కేరళ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం..!!
- గాజా బార్డర్స్ తెరవండి..WFP పిలుపు..!!
- దుబాయ్ లో Emirates Loves India చే మెగా దీపావళి ఉత్సవ్
- దళారీలను నమ్మి మోసపోవద్దు: టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు
- మంత్రి లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన
- ఇండియా VS ఆస్ట్రేలియా: తొలి వన్డే సిరీస్ రేపే ప్రారంభం