రవ్వతో అరిసెలు
- July 22, 2016
కావలసిన పదార్థాలు:
ఉప్మా రవ-1 కప్, బియ్యప్పిండి -1 కప్, బెల్లం-11/2 కప్, గసాలు-1/4 కప్, ఏలక్కుల పొడి-1/2 స్పూన్, పాలు-1 కప్, నూనె-వేయించడానికి
తయారుచేయు విధానము:
ఉప్మా రవ దోరగా వేయించాలి. ఒక వేల వేయించిన ఉప్మారవ ఉంటే వేయించనవసరం లేదు. బానలి పెట్టి,2 కప్స్ నీళ్ళు వేయాలి. నీళ్ళు బాగా మరిగినాక వేయించిన ఉప్మా రవ/సూజి వేసి ఉంటలు లేకుండా బాగా కలిపి 2 నిముషాలు మూత పెడితే, ఉప్మాలా తయారు అవుతుంది. తరువాత బెల్లం వేసి, రవ లో బాగా కలిసే లా కలపాలి. తరువాత బియ్యప్పిండి కూడా వేసి ,బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టాలి. బియ్యపిండి రవ లో కలవకపొతే,మూత పెట్టినప్పుడు ఆ వేడికి బాగా ఉడుకుతుంది. రవ మిశ్రమము చల్లగా అయ్యాక ,ఒక ప్లేట్ లో తీసుకొని కొంచం కొంచం తీసుకొని నాదుకోవాలి. ఒక వేల నాదడం కష్టమైతే, కొద్దిగా పాలు వేసుకోని పూరి పిండి లా చేసుకోవాలి. ఎక్కువ పాలు వేస్తే జారుగా అవుతుంది. అల్యూమినియం పేపర్ లేక ప్లాస్టిక్ పేపర్ పై కొద్దిగా నెయ్యి రాసి, చిన్న చిన్న పూరీ లా వత్తి,దానిపై కొద్దిగా గసాలు చల్లాలి. తరువాత నూనె వేడిలి పెట్టి, వేడి అయ్యాక, తయారు చేసుకొన్న పూరీలు వేసి, గోధుమ రంగు వచ్చేలా వేయించాలి. ఎంతో రుచిగా ఉండే రవ అరిసెలు రెడి.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







