చేతులు సంరక్షణ...
- July 22, 2016
మనలో చాలామంది ముఖంపై చూపించే శ్రద్ధ చేతుల విషయంలో చూపం. దాంతో చేతులు నల్లగా మారతాయి. ముడతలు పడతాయి. అలాంటి సమస్యల్ని తగ్గించుకోవాలంటే..
చే తులపై అక్కడక్కడా మచ్చలు పడటానికీ, ముడతలు పడటానికీ ఎండే కారణం. అందుకే వాటికీ సన్‌స్క్రీన్‌ని రాయాల్సి ఉంటుంది. ఎప్పుడయినా చేతులు కడిగితే.. వెంటనే కొద్దిగా సన్‌స్క్రీన్‌ని పట్టించాలి.
*
వారానికోసారి చేతులకు కొద్దిగా ఆలివ్‌నూనెను రాసుకుని మర్దన చేయాలి. దీనివల్ల చేతుల్లో రక్త ప్రసరణ సజావుగా జరిగి, చర్మం బిగుతుగా మారుతుంది.
*
ముఖంపైనే కాదు, చేతులపైనా మృతచర్మం పేరుకుంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు తొలగించకపోతే.. ముడతలు తప్పవు. కాబట్టి వారంలో ఒకటిరెండుసార్లు చక్కెర లేదా కాఫీపొడిలో కొద్దిగా ఆలివ్‌నూనెను కలిపి చేతులకు పూతలా వేసుకుని కాసేపయ్యాక కడిగేయాలి.
*
కేవలం చేతులే కాదు, గోళ్ల సంరక్షణ విషయంలోనూ జాగ్త్రతలు తీసుకోవాలి. వాటిపై మరకలు పడినా, గోళ్లు తాజాగా కనిపించకపోయినా సగం నిమ్మచెక్కతో రుద్దాలి.
*
చేతులపై మచ్చలు పడితే బంగాళాదుంప రసం లేదా నిమ్మరసాన్ని చేతులపై రాసి మర్దన చేయాలి. ఈ రెండూ సహజ బ్లీచింగ్‌లా పనిచేసి.. మచ్చల్ని తగ్గిస్తాయి.
కొన్నిసార్లు చేతుల వెనుక భాగంలో ముడతలు పడినట్లుగా కనిపిస్తుంటుంది. తేమ లేకపోవడం, సరైన సంరక్షణ చేయకపోవడమే ఇందుకు కారణం. కాబట్టి వారానికోసారి కొద్దిగా ఆముదాన్ని ఆ భాగాలకు రాసి మర్దన చేయండి.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







