సౌదీలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- October 22, 2025
రియాద్: సౌదీ అరేబియాలో అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులను అధికారులు అరెస్టు చేశారు. వారిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరిపిన తర్వాత నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) తెలిపింది. ప్రభుత్వ విధులను దుర్వినియోగం చేసే వారి పట్ల కఠినంగా వ్యవహారిస్తామని అథారిటీ హెచ్చరించింది.
అరెస్టయిన వారిలో పలు ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు. వారితో పాటు అవినీతికి సహకరించిన పౌరులను కూడా అరెస్టు చేసినట్టు అథారిటీ వెల్లడించింది. అరెస్టయిన వారిలో ప్రధానంగా విదేశీ పెట్టుబడిదారుడి యాజమాన్యంలోని కంపెనీకి క్రషర్ లైసెన్స్ ను చట్టవిరుద్ధంగా మంజూరు చేసి SR1,625,000 మొత్తాన్ని లంచంగా స్వీకరించిన పరిశ్రమ మరియు ఖనిజ వనరుల మంత్రిత్వ శాఖ ఉద్యోగి ఉన్నారు. ఒక గవర్నరేట్ మునిసిపాలిటీలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి చట్టవిరుద్ధంగా వాణిజ్య సంస్థకు టెండర్ జారీ చేసి SR195,000 తీసుకున్న వ్యక్తి ఉన్నారని వెల్లడించారు. వీళ్లతోపాటు పలు ప్రభుత్వ శాఖలలో పనిచేస్తూ.. తమ విధులను దుర్వినియోగం చేస్తూ పట్టుబడిన పలువురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు అథారిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?







