రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్
- October 22, 2025
విజయవాడ: కూటమి ప్రభుత్వం పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందని విద్యా, ఐటి శాఖల మంత్రి లోకేశ్ అన్నారు. అన్ని రంగాల్లో నంబర్ వన్ గా ఉండేలా కృషి చేస్తోందని చెప్పారు. తెలుగువారి సత్తాను ప్రపంచానికి పరిచయం చేసింది సీఎం చంద్రబాబేనని అన్నారు. ఆయన వయసు 75 ఏళ్లయినా 25 ఏళ్ల యువకుడిలా పనిచేస్తున్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ హయాంలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ప్రవాసాంధ్రులంతా ఆయనకు మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. చాలారాష్ట్రాల్లో డబులింజన్ సర్కార్లు ఉన్నాయి. కానీ ఏపీలో డబులింజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. కేంద్ర ప్రభుత్వ సహకారం వల్లే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. ఒక్క జూమ్కాల్తో ఆర్సెలార్ మిత్తల్ కంపెనీ ఏపీలో పెట్టుబడులకు అంగీకారం తెలిపింది.
ఈ ప్రాజెక్టు కోసం చంద్రబాబు కోరగానే ప్రధాని మోదీ సహకరించారు. పవన్ కల్యాణ్ సహకారంతో ప్రభుత్వం ముందుకెళ్లోంది. అన్ని రంగాల్లో రాష్ట్రం నంబర్ వన్ గా ఉండేలా కృషి చేస్తోంది. పోలవరం పనులు పూర్తిచేసి నీరందిస్తాం. రాష్ట్రానికి మేలు చేసే ఎలాంటి అవకాశాన్ని కూడా వదిలిపెట్టవద్దు. ఆస్ట్రేలియా కంపెనీల్లో పనిచేసే తెలుగువారు ఏపీ అంబానదర్లలా పనిచేయాలి. మీ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టే అవకాశముంటే మాకు చెప్పండి అన్ని విధాలుగా సహకారం అందిస్తాం. పెట్టుబడుల కోసం పక్క రాష్ట్రాలతో చిన్న చిన్న యుద్ధాలు జరుగుతున్నాయి. నన్ను ఎన్నో మాటలు అంటున్నారు క్రీడాస్ఫూర్తితో ముందుకెళ్తున్నా. రాష్ట్రాలు పరస్పరం పోటీ పడితేనే భారత్ గెలుస్తుంది అని లోకేశ్ చెప్పారు. ఆ అజెండాలో ఏపీని చేర్చాలి అంతకుముందు ఆస్ట్రేలియా ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్ మెక్ కేతో లోకేశ్ భేటీ అయ్యారు. ఏపీ ఇండస్ట్రియల్ క్లస్టర్లలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించాలని కోరారు.
ఆస్ట్రేలియా ఇండియా స్టేట్ ఎంగేజ్ మెంట్ అజెండాలో ఏపీని చేర్చాలన్నారు. ఆస్ట్రేలియాఏపీ సీఈవో రౌండ్ టేబుల్ సమావేశానికి మద్దతు ఇవ్వాలన్నారు. ఎనర్జీ, ఓడరేవులు, లాజిస్టిక్స్, డిజిటల్ రంగాల్లో ఏపీకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. తదుపరి సీఈవోల ఫోరం సెషన్లో ఏపీ భాగస్వామ్యాన్ని అనుమతించాలి. ప్రాధాన్యతా రంగాలు, పెట్టుబడికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులను అక్కడ ప్రదర్శిస్తాం. అని తెలిపారు. లోకేశ్ నేటి నుంచి 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో పాల్గొనాల్సిందిగా ఆస్ట్రే లియా ప్రభుత్వం తరఫున ఆ దేశ హై కమిషనర్ ఆహ్వానం మేరకు ఆయన అక్కడ పర్యటిస్తు న్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయాల్ని సందర్శించి అధునాతన బోధనా పద్ధతుల్ని అధ్యయనం చేస్తారు.
నవంబరు 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం కోసం రోడ్ షోలలో పాల్గొననున్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఎన్ఆర్వలు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపు నిచ్చారు. ఆస్ట్రే లియా పర్యాటనలో భాగంగా తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకుందామన్నారు. మళ్లీ తెలుగువారు గర్వంగా తలెత్తుకునే పరిస్థితి రావాలని తెలిపారు. చంద్రబాబును ఆక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఎన్ఆరలు అండగా నిలిచారని గుర్తు చేశారు. ఏపీకి గత 16 నెలల్లోనే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష ్యంగా పని చేస్తున్నామని స్పష్టంచేశారు. కేంద్ర సహకారం వల్ల గూగుల్ రాష్ట్రానికి వచ్చిందన్నారు.
తాజా వార్తలు
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్
- టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ అధికార నివాసభవనంలో ఘనంగా దీపావళి వేడుకలు
- ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం..
- వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలు..
- రియాద్ లో డెమోగ్రఫిక్ సర్వే ప్రారంభం..!!
- నవంబర్ 22న నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రారంభం..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ఒమన్‌లో 56.8% పెరిగిన కార్డియాక్ పరికరాల దిగుమతులు..!!
- కువైట్ లేబర్ మార్కెట్లో భారతీయులదే అగ్రస్థానం..!!
- బహ్రెయిన్ లో ఆసియా యూత్ గేమ్స్ ప్రారంభం..!!