కైకాలకి సరైన మర్యాద ఇవ్వడంలేదని వాపోతున్నారు..
- July 23, 2016
తెలుగు చిత్రపరిశ్రమలో ఎస్వీ రంగారావు తర్వాత అంతటి విగ్రహం, డైలాగ్ లో నిగ్రహం ఉన్న నటుడుగా జనం ఆదరణ పొందాడాయన.
'శారద'లో కంటతడి పెట్టించిన అన్నయ్య'తాత- మనవడు'లో నిర్దయుడైన కొడుకు'జ్యోతి'లో ఆర్ద్రత నిండినతండ్రి'శుభలేఖ'లో జిత్తులమారి నాయకుడు'యమగోల'లో మెత్తటి మనసు కలిగిన యముడు
వెరసి. నవరస నటనా సార్వభౌముడుఅతడే.. కైకాల సత్యనారాయణ. చివరగా రవితేజ "దరువు" చిత్రంలో కనిపించారు. తాజాగా, ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమకు చెందిన అనేక విషయాలని పంచుకొన్నారు. అయితే, తనకి సరైన గౌరవం ఇవ్వడంలేదని వాపోతున్నారు కైకాల. ఓ సినిమా ప్రివ్యూకి పిలుస్తున్నారా? ఫంక్షన్‌కి పిలుస్తున్నారా..?? అవార్డు ఫంక్షన్స్‌కేమైనా పిలుస్తున్నారా.. ??? టీవీలో సినిమా ప్రోగ్రామ్స్ వస్తున్నప్పుడు 'అరె.. ఇదెప్పుడు జరిగింది? కనీసం మనల్ని పిలవను కూడా లేదే' అని ఫీలైపోతున్నాడంట. పిలుస్తే వస్తారా.. ? అంటే ఓస్.. ఎందుకురానండీ. ఖచ్చితంగా అంటున్నారు. మరి.. ఇకనైనా సినీ పరిశ్రమ కైకాలకి సరైన మర్యాద ఇస్తుందని ఆశిద్ధాం..
తాజా వార్తలు
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం







