28 తర్వాత కలిసిన పేగుబంధం
- July 23, 2016
హైదరాబాద్ పోలీస్ ఆరు నెలలపాటు శ్రమించి దుబాయ్‌కి చెందిన మహిళల్ని, వారి తల్లితో కలిపారు. తల్లి నుంచి 28 ఏళ్ళ క్రితం విడిపోయిన అయేషా మరియు ఫాతిమా రసీద్ ఇటీవల హైదరాబాద్‌కి వెళ్ళి తమ తల్లి గురించిన సమాచారాన్ని తెలపాల్సిందిగా కోరారు. పోలీసులు ఆరు నెలలపాటు శ్రమించి 60 ఏళ్ళ నజియా బేగమ్‌ని కనుగొన్నారు. ఆమెను, తన కుమార్తెలతో కలిపేందుకు పోలీసులు సహకరించారు. ఈ సందర్భంగా అయేషా, ఫాతిమాతోపాటు నజియా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. తమ తండ్రి రెండో వివాహం చేసుకున్న తర్వాత, తమ తల్లిని దుబాయ్‌కి పంపేశారనీ, అప్పటినుంచీ తాము తండ్రి వద్దే ఉండిపోయామని తెలిపారు. కర్నాటకలోని బీదర్‌లో ఫ్రూట్ సెల్లర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని నజియా తిరిగి వివాహం చేసుకుంది. ఆమెకు ఇద్దరు కుమారులు ఆ తర్వాత కలిగారు. తమ తల్లిని జీవితంలో కలుసుకోలేమనుకున్నామనీ అయితే హైదరాబాద్ పోలీసుల చొరవతో తల్లిని కలుసుకోగలిగామని అయేషా చెప్పారు. ఇన్నేళ్ళుగా తల్లికి దూరంగా ఉండి చాలా బాధపడ్డామనీ ఇకపై తమ తల్లిని బాగా చూసుకుంటామని పాతిమా చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







