దుబాయ్ రన్ 2025.. టైమింగ్, రూట్స్ వివరాలు..!!
- October 25, 2025
యూఏఈ: వార్షిక దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో భాగంగా నిర్వహించే దుబాయ్ రన్ 2025 ఏడవ ఎడిషన్ కోసం ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. షేక్ జాయెద్ రోడ్ రన్నింగ్ ట్రాక్‌గా మారుతుంది. మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్, ఎమిరేట్స్ టవర్స్, దుబాయ్ ఒపెరా మరియు బుర్జ్ ఖలీఫా వంటి ల్యాండ్‌మార్క్ ల గుండా రేసు జరుగుతుంది. ప్రొఫేషనల్స్ కోసం 10 కి.మీ రూట్, ఫ్యామిలీ-ఫ్రెండ్లీ 5 కి.మీ రూట్ లను సిద్ధం చేస్తున్నారు.
నవంబర్ 23న జరిగే ఈ రేసు వివరాలను నిర్వహకులు ప్రకటించారు. రెండు కేటగిరుల్లో పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఉదయం 4 గంటల నుండి వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు. ఉదయం 6:30 గంటలకు రన్ ప్రారంభమవుతుంది.
5 కి.మీ రన్నింగ్ రూట్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ సమీపంలోని షేక్ జాయెద్ రోడ్‌లో ప్రారంభమై, బుర్జ్ ఖలీఫా మరియు దుబాయ్ ఒపెరాను దాటి దుబాయ్ మాల్ సమీపంలో ముగుస్తుంది. ఇది అన్ని వయసుల రన్నర్స్ కోసం అనువైన ఫ్లాట్ రూట్ గా పేర్కొన్నారు.
ఇక 10 కి.మీ రూట్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ దగ్గర ప్రారంభమై, దుబాయ్ కెనాల్ వంతెనను దాటి, షేక్ జాయెద్ రోడ్ వెంబడి తిరుగుతూ DIFC గేట్ దగ్గర ముగుస్తుంది. ఇది ప్రొఫేషనల్ రన్నర్స్ కు అనుకూలంగా ఉంటుందని తెలిపారు.
మీరు దుబాయ్ రన్ వెబ్‌సైట్‌లో పేర్లను నమోదు చేసుకోవచ్చు. ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. 13 ఏళ్లలోపు పిల్లలను 21 ఏళ్లు పైబడిన పెద్దలు నమోదు చేసుకోవాలి. 13 నుండి 21 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలు వ్యక్తిగతంగా నమోదు చేసుకోవచ్చు కానీ తల్లిదండ్రుల అనుమతి అవసరం. రిజిస్ట్రేషన్ తర్వాత, దుబాయ్ మునిసిపాలిటీ 30x30 ఫిట్‌నెస్ విలేజ్ జబీల్ పార్క్ నుండి మీ బిబ్ మరియు టీ-షర్ట్ ను తీసుకోవాలి. నవంబర్ 3-22 వరకు సోమవారం నుండి గురువారం వరకు సాయంత్రం 4 నుండి రాత్రి 11 వరకు, శుక్రవారం మధ్యాహ్నం 12 నుండి రాత్రి 11 వరకు, శనివారం మరియు ఆదివారం ఉదయం 8 నుండి రాత్రి 11 వరకు వీటిని నేరుగా తీసుకోవాలని నిర్వాహకులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సామూహిక విధ్వంసక ఆయుధాలపై ఖతార్ ఆందోళన..!!
- రియాద్‌లో అటానమస్ వాహనాలకు డిమాండ్..!!
- దక్షిణ అరేబియా సముద్రంలో వాయుగుండం..!!
- రేడియేషన్ ప్రమాదాలపై కువైట్ వార్నింగ్..!!
- దుబాయ్ రన్ 2025.. టైమింగ్, రూట్స్ వివరాలు..!!
- స్పేస్ యాప్స్ ఛాలెంజ్..బహ్రెయిన్ పై నాసా ప్రశంసలు..!!
- అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!
- కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!
- అరేబియా సముద్రంలో $1 బిలియన్ డ్రగ్స్ సీజ్..!!
- ఒమన్ లో స్పెషల్ ఆపరేషన్.. ఇద్దరు అరెస్టు..!!







