మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- February 09, 2026
మస్కట్: భారత నావికాదళ సెయిలింగ్ నౌక (INSV) కౌండిన్యను మస్కట్ నుండి బయలుదేరింది. ఈ సందర్భంగా జెండా ఊపి ఘనంగా వీడ్కోలు పలికారు. ఇది ఉమ్మడి సముద్ర వారసత్వంతోపాటు ఇండియా- ఒమన్ దౌత్య భాగస్వామ్యానికి ప్రతీకగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో ఒమన్ రాయల్ నేవీకి చెందిన కమోడోర్ అబ్దుల్లా అల్ హజ్రీ, విదేశాంగ మంత్రిత్వ శాఖలో మానవ వనరుల విభాగాధిపతి యూసఫ్ బిన్ ఇస్సా అల్-జాడ్జాలి, ఒమన్‌లో భారత రాయబారి జి.వి. శ్రీనివాస్ మరియు భారత నావికాదళ సెయిలింగ్ అసోసియేషన్ చైర్మన్ కమెండర్ అమిత్ శ్రీవాస్తవతోపాటు పెద్ద సంఖ్యలో భారత ప్రవాసులు పాల్గొన్నారు.
INSV కౌండిన్య పోర్బందర్ నుండి మస్కట్ వరకు తన చారిత్రాత్మక తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రయాణం రెండు దేశాలను చారిత్రాత్మకంగా సజీవ సముద్ర వారసత్వంతో తిరిగి కలుపిందని ఈ సందర్భంగా భారత,ఒమన్ అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







