హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- October 30, 2025
హైదరాబాద్: హైదరాబాద్ ఐటీ రంగంలో మరో గ్లోబల్ మైలురాయి నమోదైంది. ప్రపంచ ప్రఖ్యాత ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్ తన అత్యంత పెద్ద అంతర్జాతీయ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. 1.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అమెరికా వెలుపల మెక్‌డొనాల్డ్స్ ఏర్పాటు చేసిన అతిపెద్ద సెంటర్‌గా నిలిచింది. ఈ కేంద్రాన్ని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మెక్‌డొనాల్డ్స్ ఇండియా ప్రతినిధులు మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ గ్లోబల్ సెంటర్ ద్వారా కంపెనీకి కొత్త దిశ లభించనుందని తెలిపారు. ఈ కేంద్రం ప్రధానంగా ఇన్నోవేషన్, డిజిటల్ సొల్యూషన్స్, ఎంటర్‌ప్రైజ్ ఆపరేషన్స్, డేటా అనలిటిక్స్, ఫైనాన్స్, టెక్నాలజీ సపోర్ట్ వంటి విభాగాల్లో కీలక పాత్ర పోషించనుంది. ఈ సెంటర్ ద్వారా 1200 మందికి పైగా హై స్కిల్డ్ ప్రొఫెషనల్స్‌కి ఉపాధి లభించనుంది.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







